తెలంగాణ లోక్ సభ బరిలో 525 మంది.. స్వతంత్ర అభ్యర్థులు ఎంత మందంటే?

by Disha Web Desk 13 |
తెలంగాణ  లోక్ సభ బరిలో 525 మంది.. స్వతంత్ర అభ్యర్థులు ఎంత మందంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాకు గాను మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఈ ఎంపీ ఎన్నికల్లో 285 మంది స్వతంత్రులు పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీల నుంచి 68 మంది పోటీలో ఉండగా మిగతా రిజిస్టర్ అన్ రికగ్నజడ్ పార్టీల తరపున 172 మంది పోటీలో ఉన్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 45 మంది అభ్యర్థులు అత్యల్పంగా ఆదిలాబాద్ లో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ బై ఎలక్షన్ లో 15 మంది బరిలో ఉన్నట్లు తెలిపారు. కొన్ని చోట్ల రెండు, మూడో బ్యాలెంట్స్ యూనిట్సు వాడుతున్నామని మూడు బ్యాలెట్ యూనిట్స్ అవసరం పడే నియోజకవర్గాలు 7 ఉన్నాయని, 9 స్థానాల్లో రెండు ఈవీఎంలు వాడాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఆదిలాబాద్ లోక్ సభ స్థానంలో ఒక ఈవీఎం సరిపోతుందని తెలిపారు. ఈసీకి చెప్పి అదనంగా కొన్ని ఈవీఎంలు రప్పిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, 15 వేల మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ను జిల్లాల్లో ప్రింట్ చేస్తున్నారని, ఎల్లుండి నుంచి హోమ్ ఓటింగ్ ప్రారంభం అవుతుంది. హైదరాహబాద్ లో 3,986 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశామన్నారు.

Next Story

Most Viewed