- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఛీ.. ఛీ పాము జ్యూస్‌ను లొట్టలేసుకుని తాగుతున్న జనాలు వీడియో వైరల్..
దిశ, ఫీచర్స్: ఈ సారి ఎండలు మండిపోతున్నాయి. మార్చి నుంచే సూర్యుడి భగభగలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజు రోజుకు ఎండలు పెరుగుతూ జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో వేడికి తట్టుకోలేక చాలా మంది చల్లటి పానీయాలు తాగుతూ శరీరాన్ని ఎండ నుంచి రక్షించుకుంటున్నారు. రకరకాల పండ్లు జూస్లను తాగుతూ ఆరోగ్యాన్ని వేడి నుంచి చల్లబరుస్తున్నారు. అలాగే కొందరు సమ్మర్ డైట్ మెయిన్టైన్ చేస్తూ.. ఇంట్లోనే ఉంటూ పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. అయితే ఓ చిత్ర విచిత్ర జ్యూస్‌ను జనాలు లొట్టలేసుకుని తాగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఏకంగా పాము జ్యూస్ తాగుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇందులో ఏముందంటే.. ఓ వ్యాపారవేత్త ఓ పెద్ద గ్లాసును టేబుల్‌పై ఉంచి.. వెనిగర్ ఉన్న వాటిలోంచి పామును బయటకు తీశాడు. అయితే అది చనిపోయిన నాగుపాము. ఈ జ్యూస్‌లో పలు రకాల రసాయనాలు కూడా కలపి చివరకు దాని నుంచి జ్యూస్ తయారుచేశాడు. దాన్ని మార్కెట్లో అమ్ముతుండగా.. ఆ జ్యూస్‌ను జనాలు లొట్టలేసుకుని తాగుతున్నారు. ఈ జ్యూస్ వియత్నంలో చాలా మందికి పిచ్చి ఇష్టం ఉంటుందట. దీనిని తాగడానికి బారులు తీరతారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో అది కాస్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇక అది చూసిన నెటిజన్లు.. ఛీ ఛీ.. ఇలాంటి జ్యూస్ కూడా ఉంటుందా? ఇదేం పైత్యం అంటూ కామెంట్లు చేస్తున్నారు.