IMAX : అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్ ఓపెనింగ్‌.. ఏ చిత్రం రిలీజ్ చేస్తున్నారో తెలుసా?

by  |
IMAX : అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్ ఓపెనింగ్‌.. ఏ చిత్రం రిలీజ్ చేస్తున్నారో తెలుసా?
X

దిశ, సినిమా: వరల్డ్స్ లార్జెస్ట్ ఐమాక్స్ స్క్రీన్ ఓపెనింగ్‌కు సిద్ధంగా ఉంది. జర్మనీ లియోన్‌బర్గ్‌లోని ట్రామాప్లాస్ట్ మల్టిప్లెక్స్‌లో ఈ స్క్రీన్‌ను ఏర్పాటు చేయగా.. సెప్టెంబర్ 30 నుంచి అందుబాటులోకి రానుంది. 500 పౌండ్ల బరువు కలిగిన స్క్రీన్ 70 ఫీట్ల ఎత్తు, 125 ఫీట్ల వెడల్పులో అద్భుతంగా తీర్చిదిద్దగా… బోయింగ్ 737 విమానం కంటే వెడల్పుగా ఉండనుంది. కాగా, ప్రత్యేకంగా రూపొందించిన రొబోటిక్ ఆర్మ్ ద్వారా దీనికి పెయింటింగ్ చేయాల్సి వచ్చినట్లు తెలిపారు నిర్వాహకులు. జేమ్స్ బాండ్ ఫిల్మ్ ‘నో టైమ్ టు డై #NoTimeToDie’ ఇందులో ప్రదర్శించబడుతున్న తొలి చిత్రం కాగా.. 574 మందికి సీటింగ్ అరెంజ్‌మెంట్ ఏర్పాటు చేశారు. ఐమాక్స్ లేజర్ టెక్నాలజీ, 12 చానల్ సౌండ్ టెక్నాలజీ ఈ లార్జెస్ట్ స్క్రీన్ ప్రత్యేకతలు కాగా.. ఆడియన్స్‌ జీవితంలో మరిచిపోలేని మూవీ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు రెడీగా ఉన్నామని తెలిపారు ఐమాక్స్ సీఈఓ రిచ్ గెల్‌ఫండ్.

Next Story

Most Viewed