మహిళలు, పిల్లలే ప్రధాన బాధితులు: ఇజ్రాయెల్-గాజా యుద్ధంపై ఐరాస నివేదిక

by Dishanational2 |
మహిళలు, పిల్లలే ప్రధాన బాధితులు: ఇజ్రాయెల్-గాజా యుద్ధంపై ఐరాస నివేదిక
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-గాజా యుద్ధంలో మహిళలు, పిల్లలే ప్రధాన బాధితులని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఓ నివేదిక విడుదల చేసింది. 100 రోజులకు పైగా సాగిన యుద్ధంలో ప్రతి గంటకు 16,000 మంది మరణిస్తుండగా.. అందులో ఇద్దరు తల్లులు తమ ప్రాణాలు కోల్పోతున్నారని అంచనా వేసింది. అంతేగాక 10,000 మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయి ఉండొచ్చని తెలిపింది. భూభాగంలోని 2.3 మిలియన్ల జనాభాలో.. సుమారు 1.9 మిలియన్ల మంది ఇతర ప్రాంతాలకు పారిపోయినట్టు పేర్కొంది. మరో మిలియన్ మంది మహిళలు, బాలికలు భద్రత కోసం వేచి చూస్తున్నారని నివేదిక తెలిపింది. ‘అక్టోబర్ 7న హమాస్ దాడికి 15 ఏళ్ల ముందు జరిగిన పోరాటం కన్నా ఇది అత్యంత క్రూరమైంది. ఇంతకుముందు, గాజా, వెస్ట్ బ్యాంక్‌లో మరణించిన పౌరులలో 67శాతం మంది పురుషులు ఉండగా.. 14శాతం కంటే తక్కువ మంది మహిళలు ఉన్నారు’ అని ఐరాస మహిళా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిమా బహౌస్ తెలిపారు. ప్రస్తుత యుద్ధంలో మహిళలు, బాలికల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. గాజాలో శత్రుత్వాలు పెరుగుతున్నప్పటికీ, మహిళా హక్కుల సంస్థలు మాత్రం తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని తెలిపింది. మరోవైపు, ఇజ్రాయెల్-హమాస్ ఘర్షనలో దాదాపు 25,000 మంది పాలస్తీనియన్లు మరణించారని, వారిలో 70శాతం మంది మహిళలు, పిల్లలు ఉన్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.


Next Story