భారత్, పాక్ శాంతి చర్చలు ఆ రెండు దేశాలకు చెందిన అంశం: అమెరికా

by Disha Web |
భారత్, పాక్ శాంతి చర్చలు ఆ రెండు దేశాలకు చెందిన అంశం: అమెరికా
X

వాషింగ్టన్: భారత్-పాకిస్థాన్ మధ్య చర్చలు ఆ రెండు దేశాలకు చెందిన అంశమని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు. చర్చల విషయంలో భారత్, న్యూఢిల్లీ స్పందనపై అడిగిన ప్రశ్నకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించినట్టు ప్రైస్ తెలిపారు. 'దక్షిణ ఆసియాలో ప్రాంతీయ సుస్థిరతను చాలా కాలంగా కోరుకుంటున్నాం. మేము చూడాలనుకుంటున్నది అదే. ఇక ఇండియా, పాకిస్థాన్‌లతో మా సంబంధాల గురించి చెప్పాలంటే వారి అభిప్రాయాలను గౌరవిస్తాం. వారి మధ్య సంబంధాలు చెడిపోవాలని మేము కోరుకోవడం లేదు. వారి అభిప్రాయాలు వారివే. ఆ రెండు దేశాల మధ్య చర్చలు వాటికి సంబంధించిన అంశం' అని ప్రైస్ అన్నారు.

చాలా కాలంగా కొనసాగుతున్న సమస్యలను ఓ కొలిక్కి తెచ్చేందుకు గత వారంలో షెహబాజ్ షరీఫ్ చర్చలకు పిలుపునిచ్చారు. భారత్‌తో మూడుసార్లు యుద్ధం చేసిన తర్వాత అనేక పాఠాలు నేర్చుకున్నామని, శాంతి చర్చలను కోరుకుంటాన్నామని దుబాయ్‌కి చెందిన అల్ అరేబియాకు టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షరీఫ్ అన్నారు.


Next Story