త్వరలోనే దక్షిణ కొరియాతో యుద్దం: నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ హెచ్చరిక

by Dishanational2 |
త్వరలోనే దక్షిణ కొరియాతో యుద్దం: నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ హెచ్చరిక
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ కొరియాను తమ ప్రధాన శత్రువు అని అభివర్ణించారు. మంగళవారం ఆయన ఉత్తరకొరియా పార్లమెంటులో ప్రసంగించారు. సౌత్ కొరియా తమ పతనం కోరుతున్నందున ఇకపై దక్షిణ కొరియాతో ఏకీకరణ సాధ్యం కాదన్నారు. త్వరలో చేయబోయే యుద్ధంలో దక్షిణ కొరియాను పూర్తిగా ఆక్రమించుకోవడం, లొంగదీసుకోవడం లేదా తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రణాళికలు రచించాలన్నారు. దక్షిణ కొరియన్లను ఇకపై తోటి దేశస్తులుగా పేర్కొనకూడదని ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించేలా రాజ్యాంగాన్ని సవరించాలని తెలిపారు. అంతర్-కొరియా కమ్యూనికేషన్‌ను ధ్వంసం చేయాలని పిలుపునిచ్చారు. యూనిఫికేషన్, ఇంటర్-కొరియన్ టూరిజంతో వ్యవహరించే మూడు సంస్థలను మూసివేశారు. యుద్ధాన్ని నివారించే ఉద్దేశమే లేదని స్పష్టం చేశారు.


Next Story

Most Viewed