అమీబా బారినపడి అమెరికా బాలుడు మృతి

by Dishanational4 |
అమీబా బారినపడి అమెరికా బాలుడు మృతి
X

నెబ్రాస్కా: అమెరికాలోని నెబ్రాస్కా ప్రాంతంలో ఒక అబ్బాయి అరుదైన వ్యాధికి బలయ్యాడు. మెదడును కబళించే అమీబా బారిన పడి అతడు మరణించాడని వైద్యులు తెలిపారు. సాధారణంగా ఈత సమయంలో మనుషుల ముక్కు ద్వారా లోపలికి ప్రవేశించే నైజీరియా ఫౌలేరి అని ఈ అమీబా మెదడుకు సోకుతుందని. మెల్లమెల్లగా మెదడును కబళిస్తూ ప్రాణాంతంకంగా మారుతుందని చెప్పారు. ఈ అరుదైన అమీబా నేలలోనూ వెచ్చటి తాజా నీటిలోను సరస్సులు, నదుల్లో, వేడి బుగ్గ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటుందని చెబుతున్నారు. మెదడును మెల్లమెల్లగా కబళించివేయడంతో దీనికి బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని పేరువచ్చిందని వైద్యులు తెలిపారు.

ప్రధానంగా ఈదులాడే సమయంలో ముక్కు లోంచి ఇది లోపలకి ప్రవేశించి మెదడుకు సోకుతుందని, ఈ క్రమంలో ప్రాణాంతకంగా కూడా మారుతుందని చెప్పారు. తలనొప్పి, జ్వరం, వాంతి వంటి ప్రారంభ లక్షణాలతో రోగికి ఇన్‌పెక్షన్ సోకుతుందని, అమెరికాలో ప్రతి సంవత్సరం ముగ్గురు వ్యక్తులకు మాత్రమే ఈ అరుదైన అమీబా సోకుతోందని వైద్య నిపుణులు తెలిపారు.


Next Story

Most Viewed