దేశం కాలిపోతుందంటూ జ‌నం ఏడుస్తుంటే, భార్య‌తో ప్ర‌ధాని బోరిస్ ఇలా..!

by Disha Web Desk 20 |
దేశం కాలిపోతుందంటూ జ‌నం ఏడుస్తుంటే, భార్య‌తో ప్ర‌ధాని బోరిస్ ఇలా..!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఇల్లు కాలిపోయి ఒక‌రేడుస్తుంటే, చుట్ట కాల్చుకోడానికి నిప్పు కావాల‌న్న‌ట్లు, స‌మ‌యం సంద‌ర్భం లేకుండా చేసే కొన్ని ప‌నులు వ్య‌తిరేక‌త‌ను పెంచుతాయి. ఒక‌వైపు త‌న దేశం ద్ర‌వ్యోల్బ‌ణంతో కొట్టుమిట్టాడుతుంటే, దేశవ్యాప్తంగా జీవన వ్యయ సంక్షోభం, దూసుకుపోతున్న మాంద్యం భయాల ప్రభావంతో బాధపడుతున్న UK ప్రజల ఆందోళ‌న‌ల‌కు ఓదార్పు ఇవ్వాల్సిన స‌మ‌యంలో దేశ‌ తాత్కాలిక ప్రధానిగా ఉన్న బోరిస్ భార్య క్యారీతో హాలిడే ట్రిప్‌కు వెళ్ల‌డంపై దేశ‌వ్యాప్తంగా వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుంది. నం.10 డౌనింగ్ స్ట్రీట్‌లోని అధికారులు బోరిస్‌ ఎక్కడికి వెళ్లాడనే విషయాన్ని వెల్లడించడానికి నిరాకరించగా, ది టైమ్స్ వార్తాపత్రిక మూలాలను ఉటంకిస్తూ, ప్ర‌ధాని జాన్సన్ ఈ వారం స్లోవేనియాలో భార్య క్యారీతో క‌లిసి బిలేటెడ్‌ హనీమూన్ కోసం సెలవు తీసుకుంటున్నట్లు నివేదించింది.

ఈ ప్లెజ‌ర్‌ ట్రిప్‌లో ఆయ‌న‌ ఫైవ్ స్టార్ ఎకో-హోటల్ విలా ప్లానింకాలో బస చేస్తున్నట్లు నివేదించారు. ఇక్కడ ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడవు. అభ్యర్థనపై మాత్రమే Wi-Fi అందుబాటులో ఉంటుంది. ఇక‌, ఇక్క‌డి "అబ్బుర‌ప‌రిచే ప్రకృతి ర‌మ‌ణీయ‌ దృశ్యాలను" ఆస్వాదించడానికి టెర్రస్‌తో కూడిన కార్నర్ డీలక్స్ అపార్ట్‌మెంట్ తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. అయితే, ఆదివారం తన హోటల్ బ‌య‌ట మీడియాతో మాట్లాడిన జాన్సన్, "మేము అందుబాటులో ఉన్న ప్రతి పర్వతాన్ని ఎక్కాము. సరస్సుల్లో దూకాము, ఉత్సాహంగా సైకిలింగ్ చేశాము. అద్భుతమైన విషయాలు, భారీ గుహలు, సాలమండర్లను చూశాము!" అని చెప్పారు.

ఏది ఏమైనప్పటికీ, బ్రిటీష్ మీడియా బోరిస్ జాన్సన్ పర్యటనను విమర్శిస్తోంది. కన్జర్వేటివ్ నాయకుడిగా సెప్టెంబర్ 6 తర్వాత దేశ ప్ర‌ధాని ప‌ద‌విని లిజ్ ట్రస్‌కు గానీ, లేదంటే రిషి సునక్‌కి గానీ అప్పగించిన త‌ర్వాత ఎలాంటి ట్రిప్ అయినా చేసుకోవ‌చ్చని అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో, ఎమర్జెన్సీ బడ్జెట్ కోసం పిలుపునిచ్చినప్పటికీ, పార్లమెంటును రీకాల్ చేయాలని కూడా పిలుపునిచ్చినప్పటికీ, అవుట్‌గోయింగ్ PM బోరిస్ వాటిని ప‌ట్టించుకోకుండా ముందుగానే విరామం తీసుకున్నందుకు ప్రతిపక్షం కూడా విరుచుకుపడింది.


Next Story

Most Viewed