స్కూల్‌పై హెలికాప్టర్ల దాడి.. ఆరుగురు చిన్నారులు మృతి

by Disha Web Desk 12 |
స్కూల్‌పై హెలికాప్టర్ల దాడి.. ఆరుగురు చిన్నారులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: స్కూల్ భవనంపై ఆర్మీ హెలికాప్టర్లు జరిపిన కాల్పుల్లో ఆరుగురు పిల్లలు మృతి చెందారు. ఈ విషాద ఘటన ఉత్తర-మధ్య మయన్మార్‌లో జరిగింది. దీనిని ఆ దేశ ప్రాంత స్థానిక మీడియా వెల్లడించింది. అయితే కొంతమంది తిరుగుబాటు దారులు స్కూల్ భవనాన్ని ఆ దినం చేసుకుని ఆర్మీ బలగాల పై దాడికి దిగారు. దీంతో వారిపై ప్రతి దాడి చేసినట్లు మయాన్మార్ మిలటరీ అధికారులు తెలిపారు. ఈ దాడిలో మొత్తం ఆరుగురు విద్యార్థులు చనిపోగా అలాగే 17 మంది గాయపడ్డారు. ఫిబ్రవరి 2021లో మిలటరీ పౌర ప్రభుత్వాన్ని పడగొట్టినప్పటి నుండి మయన్మార్‌లో ఈ విదమైన హింసాత్మకంగా మారింది.


Next Story