ఆ దేశ ప్రెసిడెంట్‌ది పిల్లతనం: నార్త్ కొరియా

by Dishafeatures2 |
ఆ దేశ ప్రెసిడెంట్‌ది పిల్లతనం: నార్త్ కొరియా
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలో ఉన్న దాయాది దేశాల్లో సౌత్ కొరియా, నార్త్ కొరియా పేర్లు కూడా ఖచ్చితంగా ఉంటాయి. దాదాపు ప్రతి విషయంలో ఈ రెండు దేశాలు నిత్యం విభేదించుకుంటూనే ఉంటాయి. అయితే, తాజాగా సౌత్ కొరియా అధ్యక్షుడికి నార్త్ కొరియా షాకిచ్చింది. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉంగ్ సోదరి కిమ్ జాంగ్ ఉన్ శుక్రవారం షాకింగ్ కామెంట్స్ చేశారు. సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తన నోరు మూసుకోవాలంటూ జాంగ్ ఉన్ పేర్కొంది.

అంతేకాకుండా నార్త్ కొరియా అణు నిరోధీకరణకు బదులుగా సౌత్ కొరియా అధ్యక్షుడు ఆర్థిక సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. దానిపై జాంగ్ ఉన్ స్పందిస్తూ ఆయన నూరు మూసుకోవాలని అన్నారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. నార్త్ కొరియా గౌరవం, అణ్వాయుధాలను ఆర్థిక సహాయంతో వ్యాపారం చేయొచ్చని అనుకోవడం యోన్ సరళత్వం, పిల్లతనం అని ఆమె పేర్కొంది.


Next Story

Most Viewed