జైలులో 12 మంది మహిళా ఖైదీల పాదాలను కడిగిన పోప్ ఫ్రాన్సిస్

by Disha Web Desk 17 |
జైలులో 12 మంది మహిళా ఖైదీల పాదాలను కడిగిన పోప్ ఫ్రాన్సిస్
X

దిశ, నేషనల్ బ్యూరో: పోప్ ఫ్రాన్సిస్ రోమ్ జైలులోని 12 మంది మహిళా ఖైదీల పాదాలను కడిగి, ముద్దాడారు. ఈస్టర్‌కు ముందు పవిత్ర గురువారం నాడు ఆయన అర్జెంటీనా జెస్యూట్ ఇటాలియన్ రాజధాని ఈశాన్య శివార్లలోని రెబిబ్బియా మహిళా జైలును సందర్శించారు. ఈ సందర్బంగా 87 ఏళ్ల పోప్ వీల్‌చైర్‌లో కూర్చుని ఖైదీల పాదాలను కడిగారు, ఇలా చేస్తున్నప్పుడు చాలా మంది మహిళలు ఏడ్చారు. మెల్లగా పాదాలపై నీరు పోసి తువాలుతో తుడిచి, ముద్దుపెట్టారు. ఫ్రాన్సిస్ 2013లో పోప్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తరచూ జైళ్లు, శరణార్థుల కేంద్రాలను సందర్శిస్తూ ఉంటారు. గత ఏడాది పవిత్ర ఈస్టర్‌కు ముందు గురువారం నాడు బాల్య నిర్బంధ కేంద్రాన్ని సందర్శించి 12 మంది యువకుల పాదాలు కడిగారు. గత నెలలో, పోప్‌కు ఫ్లూ సోకడంతో కొన్ని బహిరంగ సభలను రద్దు చేసుకున్నారు. ఆయన కోలుకున్న తరువాత, చాలా సందర్భాల్లో తన ప్రసంగాలను ఇతరులతో చదివి వినిపిస్తున్నారు. దాదాపు 370 మంది మహిళలను ఉంచే జైలు ప్రాంగణంలో జరిగిన సామూహిక కార్యక్రమంలో పోప్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed