ఇండియ‌న్ ఆర్మీని మెచ్చుకున్న పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్! ఇందుకేనా..?!

by Disha Web Desk 20 |
ఇండియ‌న్ ఆర్మీని మెచ్చుకున్న పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్! ఇందుకేనా..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః "ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గున మండుతుంద‌న్న‌" మాట ఒక‌ప్పుడు, 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా విడుద‌ల త‌ర్వాత‌ పాక్‌-భార‌త్‌ల మ‌ధ్య మంచి నీళ్లు పోసినా పెట్రోల్‌లా మండే ప‌రిస్థితి దాపురించిందంటున్నారు విమ‌ర్శ‌కులు. అందుకే, ఆ సినిమా ద‌ర్శ‌కుడు విమ‌ర్శ‌కుల మాట‌ ప‌క్క‌కు నెట్టి, కోట్లు కుమ్మ‌రించిన 'ఇండియ‌న్‌' ప్రేక్ష‌కులే న్యాయ‌నిర్ణేత‌ల‌న్నాడు. స‌రిగ్గా ఇలాటి నేప‌ధ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార‌త ఆర్మీని పొగ‌డ‌టం 'ఇండియ‌న్స్‌'ను షాక్‌కు గురిచేసింది. అందులోనూ, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కీలకమైన అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటున్న సమయంలో, తనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన 'మాస్ట‌ర్‌' పాకిస్థాన్ మిల‌ట‌రీ పట్ల ఇమ్రాన్ ఖాన్ కాస్త కోపంగా ఉన్నాడు. ఈ త‌రుణంలో, పార్లమెంటులో మెజారిటీని కోల్పోయిన ఇమ్రాన్‌ను "రాజీనామా" చేయాల్సిందిగా పాకిస్థాన్ మిల‌ట‌రీ కూడా కోరింది. ప్రజాస్వామ్యం ముసుగేసుకున్న మిల‌ట‌రీ రాజ్యం ఎంత దారుణంగా ఉంటుందో మాజీ క్రికెట‌ర్‌, మాజీ కాబోతున్న పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఈ సంద‌ర్భంతో తెలిసొచ్చిందేమో కానీ "నేను భారతదేశానికి సెల్యూట్ చేస్తున్నాను. పాకిస్తాన్ కంటే భారతదేశ విదేశాంగ విధానం ఉత్తమమైనది, వారు తమ ప్రజల కోసం పని చేస్తారు, భారత సైన్యం అవినీతికి పాల్పడదు. సివిల్ గ‌వ‌ర్న‌మెంట్‌లో వాళ్లు (మిల‌ట‌రీ) ఎప్పుడూ జోక్యం చేసుకోదు' అని పాక్ సైన్యం పేరు ప్రస్తావించకుండా ఇమ్రాన్ ఖాన్ ఇటీవ‌ల‌ ఒక బహిరంగ సభలో వెల్ల‌డించారు.

పాకిస్థాన్‌లో ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌కు మిల‌ట‌రీ అధికారానికి మ‌ధ్య ర‌చ్చ ర‌గులుకున్న త‌రుణంలో ఇమ్రాన్‌ ఖాన్‌ మాత్రం తనపై అవిశ్వాస తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు మార్చి 27న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి చేరుకోవాలని "మిలియన్ల" మంది మద్దతుదారులను కోరారు. రికార్డులన్నీ బద్దలయ్యే విధంగా ప్రజల హాజరు ఉండాలని విజ్ఞ‌ప్తి చేశారు. "పాకిస్థాన్ ఆత్మ కోసం పోరాడాలని నేను కోరుకుంటున్నాను. దోచుకున్న సంపదను కాపాడుకోవడానికి రాజకీయ మాఫియాలు, రాజకీయ నాయకులను సిగ్గులేకుండా కొనుగోలు చేయడాన్ని మేము ఖండిస్తున్నాము. మేము నిజంతో నిలబడతాము" అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Next Story

Most Viewed