Pakistan: కొత్త ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ ఆసిమ్ మునీర్

by Dishafeatures2 |
Pakistan: కొత్త ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ ఆసిమ్ మునీర్
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ కొత్త ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ ఆసిమ్ మునీర్ నియమితులు కానున్నారు. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం ఉతర్వులు జారీ చేసింది. డిసెంబర్ మొదటి వారంలో ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఖమర్ జావెద్ బజ్వా నుంచి ఆసిమ్ మునీర్ కొత్త ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరిస్తారని పాక్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ వెల్లడించారు. రాజ్యాంగాన్ని అనుసరించే కొత్త ఆర్మీ చీఫ్ ను నియమిస్తున్నామని స్పష్టం చేశారు. కాగా.. ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఖమర్ జావెద్ బజ్వా మాట్లాడుతూ.. పాక్ రాజకీయ పరిణామాల్లో సైన్యం పాత్ర ఏ మాత్రం లేదని తేల్చి చెప్పారు. అమెరికా కుట్ర వల్లే తన ప్రభుత్వం పడిపోయిందని ఇమ్రాన్ ఖాన్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేనే లేదన్నారు. 17వ ఆర్మీ చీఫ్ గా ఆసిమ్ వచ్చే నెలలో బాధ్యతలు స్వీకరించనున్నారు. 1947 నుంచి ఇప్పటివరకు 17 మంది పాక్ ఆర్మీ చీఫ్ లు అయ్యారు. ఇక ఇదే కాలంలో దాదాపు 30 మంది పాక్ ప్రధానమంత్రులు అయ్యారు.



Next Story