IDF: ఇరాన్ సైనిక ప్రధాన కార్యాలయంపై వైమానిక దాడి : వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్

by Ramesh Naini |

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఇరానియన్ సాయుధ దళాల ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దళం దాడి చేసినట్లు ప్రకటించింది.

IDF: ఇరాన్ సైనిక ప్రధాన కార్యాలయంపై వైమానిక దాడి : వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఇరానియన్ సాయుధ దళాల ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దళం దాడి చేసినట్లు ప్రకటించింది. ఈ దాడికి సంబంధించిన వీడియోను ఆదివారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) విడుదల చేసింది. సదరు వీడియోను CNN అంతర్జాతీయ మీడియా ధృవీకరించింది. వీడియోతో పాటు విడుదల చేసిన ప్రకటనలో, ‘టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న ఇరాన్ ఉగ్రవాద పాలన ప్రధాన కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాం’ అని ఇజ్రాయెల్ పేర్కొంది. ఒక స్థావరపై దాడి నేపథ్యంలో పెద్ద ఎత్తున్న పెలుడు, పోగలు దట్టంగా కమ్మేసిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఈ దాడిలో ఎంత మంది మరణించారనేది తెలియాల్సి ఉంది. ఇరాన్ ప్రభుత్వం దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా విడుదల చేయలేదు.

Next Story