- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BIG BREAKING: ఆల్‌టైమ్ కనిష్ఠానికి రూపాయి విలువ.. ఆసియాలో రెండవ అత్యంత బలహీన కరెన్సీగా రికార్డు
బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్న వేళ రూపాయి కూడా షాకిచ్చింది. అమెరికన్ డాలర్ వద్ద రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ఠానికి పతనమైంది.

దిశ, వెబ్‌డెస్క్: బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్న వేళ రూపాయి కూడా షాకిచ్చింది. అమెరికన్ డాలర్ వద్ద రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ఠానికి పతనమైంది. దీంతో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది.
నేడు భారత రూపాయి మరోసారి భారీ ఒత్తిడికి లోనైంది. గ్రీన్‌ల్యాండ్ వివాదానికి సంబంధించి అంతర్జాతీయ మార్కెట్లలో పెరిగిన అనిశ్చితి, విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి నిరంతరంగా పెట్టుబడులు ఉపసంహరించుకోవడంతో రూపాయి డాలర్‌తో పోలిస్తే కొత్త రికార్డు కనిష్టానికి చేరింది. మధ్యాహ్నం ట్రేడింగ్‌లో రూపాయి డాలర్‌తో పోలిస్తే 91.7450 స్థాయికి పడిపోయింది. మధ్యాహ్నం 2.12 గంటల సమయంలో రూపాయి 91.6837 వద్ద ట్రేడ్ అయింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి డాలర్‌కు 91.0800 వద్ద ఓపెన్ అయింది. నిన్న ట్రేడింగ్ ముగింపు సమయంలో డాలర్ విలువ రూ.90.9775 వద్ద ఉంది.
రెండవ అత్యంత బలహీన కరెన్సీగా రూపాయి
రూపాయి విలువ పతనమవ్వడంపై ఫిన్రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ ఎల్‌ఎల్‌పీ ట్రెజరీ హెడ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ భంసాలి మాట్లాడుతూ.. ట్రంప్ గ్రీన్‌ల్యాండ్ వివాదం, జపాన్ బాండ్ మార్కెట్‌లో అమ్మకాలు, రిస్క్ అవర్షన్ కారణంగా రూపాయి మరోసారి కొత్త కనిష్టమైన 91.7425 స్థాయికి పడిపోయిందని తెలిపారు. ఈక్విటీ మార్కెట్లు కూడా పడిపోవడంతో వరుసగా ఆరవ రోజు మార్కెట్లలో నష్టాలే కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గడిచిన మూడు నెలల్లో రూపాయికి ఇదే అతిపెద్ద పతనమన్నారు. ఈ పతనంతో 2026లో ఇప్పటివరకు ఆసియా కరెన్సీల్లో రూపాయి రెండవ అత్యంత బలహీన కరెన్సీగా మారింది. ఈ ఏడాది ఇప్పటివరకు రూపాయి దాదాపు 1.98 శాతం నష్టపోయింది.
జనవరి నెలలో ఇప్పటివరకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి సుమారు రూ.33 వేల కోట్లు ఉపసంహరించుకున్నారని భంసాలి తెలిపారు. 12 రోజుల్లో నెట్ అమ్మకాలు జరగడం వల్ల దేశీయ మార్కెట్లపై తీవ్ర ఒత్తిడి పెరిగిందన్నారు. భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంలో జాప్యం, భారత ఎగుమతులపై అమెరికా అధిక టారిఫ్‌లు విధించడం, ముఖ్యంగా విలువైన లోహాల దిగుమతిదారుల నుంచి పెరిగిన డాలర్ డిమాండ్ రూపాయి పతనాన్ని మరింత పెంచిందని తెలిపారు.






