ఫోన్ నెంబర్ మార్చుకుంటే ఉద్యోగం మీదే.. వింత రూల్ పెట్టిన కంపెనీ

by Disha Web Desk 4 |
ఫోన్ నెంబర్ మార్చుకుంటే ఉద్యోగం మీదే.. వింత రూల్ పెట్టిన కంపెనీ
X

దిశ, వెబ్‌డెస్క్: కొన్ని కంపెనీలు వింత రూల్స్, కండీషన్స్ పెడుతూ ఉంటాయి. తమ కంపెనీలో చేరాలంటే ఈ రూల్స్ పాటించాలని ఆఫర్ లెటర్స్ లో పేర్కొంటూ ఉంటాయి. రూల్స్ పాటించకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉంటాయి. ఇక కంపెనీలో చేరిన తర్వాత ఆఫీసుల్లో బోల్డెన్నీ రూల్స్ పెడతాయి. ఉద్యోగం చేయాలంటే ఆ రూల్స్ ను తప్పనిసరిగా పాటించాల్సిందే. కొన్ని కంపెనీలు వింత రూల్స్ పెడుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక వింత రూల్ ను పెట్టింది ఓ కంపెనీ.

ఉద్యోగం కావాలంటే ఫోన్ నెంబర్ ను మార్చుకోవాల్సిందిగా దరఖాస్తుదారులకు ఓ కంపెనీ సూచించిన విషయం ఆశ్చర్యకరంగా మారింది. గాంగ్ డాంగ్ లోని షెంగెన్ కు చెందిన ఓ ఎడ్యుకేషన్ కంపెనీ పెట్టిన ఆ వింత నిబంధన చూసి చాలామంది షాక్ కు గురవుతున్నారు. ఇంతకు ఆ నిబంధన ఏంటో ఇప్పుడు చూద్దాం.

షెంగాన్ కు చెందిన ఓ ఎడ్యుకేషన్ కంపెనీ తమ కంపెనీలో ఉద్యోగాలకు ప్రకటన జారీ చేసింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు చాలా వచ్చాయి. అయితే అప్లికేషన్ పంపేందుకు ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ లాంటి వివరాలు తప్పనిసరిగా ఇస్తాం. అయితే ఫోన్ నెంబర్ లోని 5వ స్థానంలో 5వ నెంబర్ ఉన్న అభ్యర్థుల అప్లికేషన్లను కంపెనీ తిరస్కరించింది. ఫోన్ నెంబర్ మార్చుకుని మళ్లీ అప్లై చేసుకోవాలని సూచించింది. ఉద్యోగం కావాలనుకుంటే ఫోన్ నెంబర్ మార్చుకోవాల్సిందేనని కండీషన్ పెట్టడం చూసి చాలామంది నవ్వుకుంటున్నారు.

పురాత చైనీస్ భవిష్యవాణి 'బుక్ ఆఫ్ చేంజెస్' ప్రకారం ఐదు దురదృష్టకరమైన సంఖ్యగా కొందరు అక్కడ భావిస్తారు. ఆ కంపెనీ ఇలాంటి మూఢనమ్మకాలను ఇప్పటికీ నమ్ముతుందట. అందుకని వారి దరఖాస్తులు తిరస్కరించినట్లు చెబుతున్నారు.


Next Story

Most Viewed