స‌ముద్రం ఒడ్డున‌ భారీ స్నేక్‌ స్కెలిట‌న్‌! గూగుల్ మ్యాప్‌లో గుర్తింపు (వీడియో)

by Disha Web Desk 20 |
స‌ముద్రం ఒడ్డున‌ భారీ స్నేక్‌ స్కెలిట‌న్‌! గూగుల్ మ్యాప్‌లో గుర్తింపు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ః గూగుల్ మ్యాప్స్‌లో ప్ర‌పంచాన్ని చూస్తే ఎన్నో వింత‌లు క‌నిపిస్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ భూమి పైన ఉన్న కొన్ని విచిత్రమైన, అద్భుతమైన విషయాలు దీని ద్వారా వెలుగులోకి వ‌స్తాయి కూడా. అయితే, తాజాగా ఓ వ్య‌క్తి గూగుల్ మ్యాప్స్ చూస్తూ ఫ్రాన్స్‌లో ఒక భారీ 'పాము అస్థిపంజరం' గ‌మ‌నించాడు. ఎంత పెద్ద‌దంటే చాలా భారీ ఆకారంతో భ‌యంగొలిపేదిగా ఉంటుంది. అయితే, అది అస్థిపంజ‌రం గ‌నుక మ‌రింత‌ ఆస‌క్తిని రేకెత్తించింది. ఇక ఇంకెక్క‌డా లేని విధంగా ఇంత‌టి భారీ పాము క‌నిపించ‌డంతో ఈ విష‌యం నెట్టింట్లో సంచలనం సృష్టించింది. @googlemapsfun అనే టిక్‌టాక్‌ ఖాతా ప్ర‌త్యేకంగా గూగుల్‌ మ్యాప్స్‌ని అన్వేషిస్తూ, అందులో కనుగొన్న స‌రికొత్త విషయాలతో వీడియోలను షేర్ చేస్తుంది. ఈ క్ర‌మంలో ఈమ‌ధ్య‌ ఫ్రాన్స్ తీరంలో దొరికిన ఈ పెద్ద పాము స్కెలిట‌న్‌ వీడియోను షేర్ చేసింది. అయితే, ఈ పాము అస్థిపంజరం అంతరించిపోయిన 'టైటానోబోవా'ది కావచ్చు అని ఆస‌క్తిక‌ర పాయింట్ జోడించారు. అలాగే, ఇది చాలా పెద్ద పాముల జాతికి చెందినదని కూడా పోస్టులో పేర్కొన్నారు.


వైర‌ల్ అయిన ఈ వీడియో టిక్‌టాక్‌లో 2 మిలియన్లకు పైగా వ్యూవ్స్ అందుకుంది. ఇక‌, స్నోప్స్ వైరల్ స‌ద‌రు క్లిప్‌పై జరిపిన పరిశోధనలో 'పాము అస్థిపంజరం' వాస్తవానికి "లే సర్పెంట్ డి'ఓషన్" అని, ఇది లోహంతో చేసిన పెద్ద‌ శిల్పం అని కనుగొన్నారు. ఇది ఫ్రాన్స్ పశ్చిమ తీరంలో ఉంది. దీని ఎత్తు 425 అడుగులు కావ‌డం విశేషం. ఎస్టుఎయిరి ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో భాగంగా "లే సర్పెంట్ డి'ఓషన్‌"ను 2012లో ఆవిష్కరించారు. చైనీస్-ఫ్రెంచ్ కళాకారుడు హువాంగ్ యోంగ్ పింగ్ దీన్ని రూపొందించారు.


Next Story

Most Viewed