యూనివర్సిటీలో ఫేక్ వెడ్డింగ్.. శోభనం కూడా

by Disha Web Desk |
యూనివర్సిటీలో ఫేక్ వెడ్డింగ్.. శోభనం కూడా
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా యూనివర్సిటీస్ యానువల్ కల్చరల్ ఫెస్ట్ జరుపుకోవడం కామన్. ఈ ఈవెంట్‌లోపలు రకాల కల్చరల్ యాక్టవిటీస్ ప్లాన్ చేయడం సాధారణమే. కానీ పాకిస్థాన్‌కు చెందిన లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ ఓ వింత పద్ధతితో సోషల్ మీడియా అటెన్షన్ క్యాచ్ చేసింది. అసలు ఊహకు అందని విధంగా ఈవెంట్‌ను ప్లాన్ చేసి ఇంటర్నేషనల్ మీడియా హెడ్‌ లైన్స్‌లో నిలిచింది. ‘ఫేక్ వెడ్డింగ్’ థీమ్‌తో విమర్శలపాలవుతోంది.

ఇందులో భాగంగా వరుడుగా ఓ అబ్బాయి, వధువుగా ఓ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు స్టూడెంట్స్. సంప్రదాయబద్ధంగా పెళ్లి నిర్వహించేందుకు మరొకరిని సెలెక్ట్ చేసుకోగా.. బరాత్‌, మెహందీ సెరమనీస్‌లో బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేసేందుకు మరికొందరు రెడీ అయిపోయారు. మొత్తానికి ఫైనల్ లిస్ట్ రెడీ అయ్యాక అనుకున్న విధంగా.. అన్ని ఆచార వ్యవహారాలతో ఆ ఇద్దరికీ ఫేక్ పెళ్లి చేసేశారు. దీనికి ‘బ్యాచ్ షాదీ’ అని పేరు పెట్టిన విద్యార్థులు.. ఆ తర్వాత డ్యాన్స్‌లతో హంగామా చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్ దారుణంగా విమర్శిస్తున్నారు. పెళ్లి అంటే ఇంత తేలికగా తీసుకున్నారేంటి? అని కొందరు అంటుంటే.. శోభనం కూడా చేయలేకపోయారా అని మరికొందరు మండిపడుతున్నారు.


Next Story

Most Viewed