జర్నలిస్ట్‌కు హౌస్ అరెస్ట్ శిక్ష వేసిన కోర్టు.. ఆ నిరసన తెలిపినందుకే..

by Dishafeatures2 |
జర్నలిస్ట్‌కు హౌస్ అరెస్ట్ శిక్ష వేసిన కోర్టు.. ఆ నిరసన తెలిపినందుకే..
X

దిశ, వెబ్‌డెస్క్: ఉక్రెయిన్, రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి చాలా దేశాలు రష్యాకు వ్యతిరేకంగా మారాయి. ప్రపంచ దేశాల ప్రజలు సైతం ఉక్రెయిన్ పట్ల రష్యా ప్రవర్తనను తప్పుబడుతున్నారు. ఇందులో రష్యా దేశ ప్రజలు కూడా ఉన్నారు. స్టాప్ వార్ అంటూ అనేక నినాదాలతో నిరసనలు కూడా తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే నిరసనలు తెలిపిన ఓ జర్నలిస్ట్‌కు రష్యా కోర్టు హౌస్‌అరెస్ట్ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. రష్యా కోర్టు ఈ మేరకు తీర్పును గురువారం తెలిపింది.

అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపిన జర్నలిస్ట్ మరినా ఓవ్‌స్యానికోవాను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను గురువారం కోర్టులో హాజరుపరిచారు. అయితే మరీనా నిరసనలే కాకుండా, ఓ టీవీ ఛానెల్ లైవ్‌ మధ్యలో 'నోవార్' ప్లకార్డుతో కనిపించి ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే మరీనాకు కోర్టు విధించిన హౌస్ అరెస్ట్ శిక్ష ఈ నిరసనలు, ప్లకార్డులకు సంబంధించి కాదు.

జులై మధ్యలో జరిగిన నిరసనల్లో మరీనా 'పుతిన్ ఓ హంతకుడు, అతడి సైనికులు ఫాసిస్టులు' అంటూ పోస్టర్లతో నిరసన తెలిపింది. అంతేకాకుండా 'చనిపోయిన చిన్నారుల ఆత్మలు నిన్ను వెంటాడుతారు' అని ఆమె పోస్టర్లు చూపింది. వీటిపై నమోదు చేసిన కేసులో భాగంగానే రష్యా పోలీసులు ఆమెను గురువారం కోర్టులో హాజరు పరిచారు. ఈ విచారణలో మరీనాను అక్టోబర్ 9 వరకు హౌస్ అరెస్ట్‌లో ఉంచాలని కోర్టు తీర్పునిచ్చింది.


Next Story

Most Viewed