ఇటీవల కనిపెట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద అనకొండ మృతి.. జీవవైవిధ్యానికి పెద్ద దెబ్బ

by Disha Web Desk 17 |
ఇటీవల కనిపెట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద అనకొండ మృతి.. జీవవైవిధ్యానికి పెద్ద దెబ్బ
X

దిశ, నేషనల్ బ్యూరో: కొద్ది వారాల క్రితం అమెజాన్ అడవుల్లో కనుగొన్నటువంటి ప్రపంచంలోనే అతి పెద్ద అనకొండ చనిపోయింది.దాని మృతికి గల కారణాలను పరిశోధకులు అన్వేషిస్తున్నారు. అనా జూలియా అనే పిలవబడే ఇది నేషనల్ జియోగ్రాఫిక్ డిస్నీ+ సిరీస్ 'పోల్ టు పోల్' చిత్రీకరణలో భాగంగా కనుగొనబడింది. ఇది ఒక నార్తర్న్ గ్రీన్ అనకొండ, 26 అడుగుల పొడవు, 440 పౌండ్ల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంది. దీని తల మనిషి పరిమాణంలో భారీ సైజులో ఉంటుంది. జీవశాస్త్రవేత్తలు అనా జూలియా DNAని నిశితంగా విశ్లేషించగా, ఇతర అనకొండలతో పోలిస్తే 5.5% వ్యత్యాసాన్ని కలిగి ఉంది. ప్రొఫెసర్ ఫ్రీక్ వోంక్ ఇన్‌స్టాగ్రామ్‌లో దీని మరణ వార్తను షేర్ చేశారు.

నా హృదయంలో విపరీతమైన బాధ ఉంది. శక్తివంతమైన పెద్ద ఆకుపచ్చ అనకొండ ఈ వారాంతంలో నదిలో చనిపోయిందని మీకు తెలియజేయాలనుకుంటున్నాను, ఈ తెలివితక్కువ పనిని చేసిన వేటగాళ్లను ఖండిస్తున్నాను. ఇంత ప్రత్యేకమైన జంతువును ఇలా చేయడం చాలా దారుణం. అది రాబోయే సంవత్సరాలలో తన సంతనాన్ని ఉత్పత్తి చేయగలదు. కానీ అది చనిపోవడం చాలా బాధాకరం. జీవవైవిధ్యానికి ఇది పెద్ద దెబ్బ అని వోంక్ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్నారు. ఈ భారీ పామును కాల్చినట్టుగా మొదటగా భావించగా, దీనికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు మాత్రం కనుగొనలేదు. సాధ్యమైనంత వేగంగా దీని మృతికి గల కారణాలను కనిపెడతామని పరిశోధకులు తెలిపారు.


Next Story

Most Viewed