1930 నాటి మాంద్యంలోకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ

3

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వల్ల ప్రపంచం మరోసారి భారీగా ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తోందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మల్‌పాస్ తెలిపారు. అభివృద్ధి చేందుతున్న, పేద దేశాలకు కరోనా పెనుముప్పుగా మారిందని ఆయన ఆందోళ వ్యక్తం చేశారు.

చరిత్రలో 1930 తర్వాత ఈ తరహా ఆర్థిక మాంద్యం ఏర్పడిందని, మళ్లీ 80 ఏళ్లకు ఆ స్థాయి ఉత్పాతం పునరావృతమైందని ఆయన పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంక్షోభం కారణంగా రుణ సంక్షోభాలు విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయని ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ వార్షిక సమావేశంలో డెవిడ్ చెప్పారు. పేదరికంతో అల్లాడుతున్న దేశాలను కరోనా భారీగా కృంగదీసిందని, ప్రపంచాన్ని తీవ్రమైన ఆర్థిక మాంద్యం చుట్టుముట్టిందని స్పష్టం చేశారు.

దీనివల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలకే కాకుండా పేద దేశాల పరిస్థితి పూర్తిగా దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పలు దేశాలకు అండగా వృద్ధి కార్యక్రమాలను ప్రపంచ బ్యాంకు రూపొందిస్తోందని, కరోనాకు వ్యాక్సిన్‌లను అందించేందుకు సుమారు 12 బిలియన్ డాలర్ల విలువైన హెల్త్ ఎమర్జెన్సీ కార్యక్రమాల విస్తరణకు బోర్డు ఆమోదం తెలిపిందని చెప్పారు.