కరోనాపై పోరుకు బాక్సర్ అమీర్ భారీ సాయం !

by  |
కరోనాపై పోరుకు బాక్సర్ అమీర్ భారీ సాయం !
X

ప్రపంచమంతా కరోనాతో విలవిల్లాడతున్న సమయంలో ప్రముఖులు, క్రీడాకారులు, సెలబ్రిటీలు తమ చేతనైనంత సాయం చేస్తున్నారు. కొంతమంది డబ్బును విరాళంగా ఇస్తే, మరి కొందరు ఆసుపత్రులను దత్తత తీసుకుంటున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ రూ.50 లక్షల విలువైన బియ్యాన్ని పేదల కోసం అందించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ దాతృత్వం కొనసాగుతూనే ఉంది.

ఈ క్రమంలో ప్రపంచ ప్రొఫెషనల్ బాక్సింగ్ చాంపియన్ అమీర్ ఖాన్ భారీ సాయాన్ని అందించాడు. యూకేలో తనకున్న 250 కోట్ల రూపాయల విలువైన కమర్షియల్ కాంప్లెక్స్‌ను కోవిడ్ 19 బాధితుల చికిత్స కోసం ఉపయోగించమని నేషనల్ హెల్త్ సర్వీసెస్‌ను కోరాడు. 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ 4 అంతస్తుల భవంతిలో ఫంక్షన్ హాల్స్, మాల్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఆ భవంతినే కరోనా బాధితులకు తాత్కాలిక ఆసుపత్రిగా ఉపయోగించమని అతను యూకే ప్రభుత్వాన్ని కోరాడు. కాగా, బాక్సర్ అమీర్ ఖాన్ దాతృత్వాన్ని పొరపాటుగా ‘బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్’ ఇచ్చాడనుకొని చాలా మంది సామాజిక మాధ్యమాల్లో అతని ఫోటోతో వార్తలు సర్క్యులేట్ చేయడం గమనార్హం.

Tags: Corona, donation, UK, Boxer Amir, Huge help, Valuable building


Next Story

Most Viewed