‘2021-2022లో భారత జీడీపీ వృద్ధి 8.3 శాతం’

by Harish |
‘2021-2022లో భారత జీడీపీ వృద్ధి 8.3 శాతం’
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా భారత ఆర్థిక పునరుద్ధరణ నెమ్మదిస్తుందని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో 2021-2022 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి అంచనాను 8.3 శాతానికి అంచనా వేసింది. అదేవిధంగా 2022-2023 ఆర్థిక సంవత్సరానికి 7.5 శాతానికి వృద్ధి పరిమితమవుతుందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. సెకెండ్ వేవ్ వల్ల ఆర్థిక రికవరీని దెబ్బతీస్తుందని, ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలు, బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లపై కరోనా ప్రతికూల ప్రభావం ఉంటుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది.

దీంతోపాటు వినియోగదారుల విశ్వాసం క్షీణించడం ద్వారా వృద్ధి రేటు మందగిస్తుందని వివరించింది. వీటితో పాటు ఆదాయ క్షీణత, ఉద్యోగ అవకాశాలపై కరోనా అనిశ్చితి కొనసాగుతుందని తెలిపింది. పెట్టుబడి అవకాశాలపై కూడా ప్రభావం ఉంటుందని, ఈ సవాళ్లను అధిగమించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం మౌలిక సదుపాయాలపై వ్యయం పెంచాలని, ఆరోగ్య మౌలికంపై ఖర్చు చేయాల్సి ఉందని, సేవల రంగం పునరుజ్జీవనం పొందగలిగితే ఆర్థికవ్యవస్థ రికవరీ సాధించే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed