విషాదం : మేనేజర్ చేసిన పనికి కార్మికుడు బలి

65

దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుమలపాడులో విషాదం చోటు చేసుకుంది. సెల్పీ వీడియో తీసుకుని ఓ కెమికల్ ఫ్యాక్టరీ కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. అశోక్ అనే కార్మికుడు బుధవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనను తన మేనేజర్ చిత్రహింసలకు గురిచేస్తున్నారని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. అంతే కాకుండా ఆ బాధలు భరించలేకనే తాను ఆత్మహత్య చేసుకుటున్నట్టు సెల్ఫీ వీడియాలో తెలిపారు. అశోక్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కర్నూలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..