పండుగ వేళ మహిళల వినూత్న నిరసన.. బతుకమ్మకు బదులుగా..

301

దిశ, హుజూరాబాద్ రూరల్ : బతుకమ్మలకు బదులు.. గ్యాస్ సిలిండర్లు పెట్టి బతుకమ్మ ఆడి మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు. బుధవారం బతుకమ్మ పండుగ ప్రారంభం కాగా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను నిరసిన తెలిపారు.

ఈ సందర్బంగా పట్టణంలోని ప్రతాపవాడ శివాలయం వద్ద మహిళలు గ్యాస్ సిలిండర్ పెట్టి బతుకమ్మ పాటలు పాడుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.230 ఉన్న గ్యాస్ ధరలను వెయ్యి రూపాయలకు పెంచి సామాన్యులపై పెనుభారం మోపిందంటూ పాటలు పాడుతూ తమ నిరసన గళాన్ని వినిపించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..