వేధింపులు తట్టుకోలేక కోడలు మృతి.. భర్త ఇంటికి నిప్పు పెట్టిన బంధువులు

65

దిశ, వెబ్ డెస్క్ : జమ్ము కాశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆగ్రహానికి లోనైన మహిళ తరఫు బంధువులు, కుటుంబ సభ్యులు.. ఆమె భర్త ఇంటికి నిప్పు అంటించారు.

ఈ విషయం తెలుసుకున్న మహిళ తరఫు కుటుంబ సభ్యులు.. ఆమె భర్త ఇంటికి నిప్పటించారు. వివరాల ప్రకారం.. అనంత్‌నాగ్ జిల్లాలోని మొమినాబాద్‌కు చెందిన 30ఏళ్ల నఫీసా తన భర్త అతిఫ్‌ గుల్‌ మిస్గర్‌తో కలిసి నివసిస్తోంది. అయితే, కొద్ది రోజులుగా ఆమెను.. భర్త, కుటుంబసభ్యులు వేధింపులకు గురిచేస్తుండంతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది.

అనంతరం ఆమె మృతి చెందిన విషయం తెలుసుకున్న నసీఫా కుటుంబసభ్యులు, బంధువులు.. ఆమె భర్త అతిఫ్‌ ఇంటికి వచ్చి బీభత్సం సృష్టించారు. ఇంటికి నిప్పు అంటించారు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా పొగ కమ్ముకుంది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో అతిఫ్ ఇల్లు మాత్రం పూర్తిగా కాలిపోయింది.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..