భర్త కోసం నరక యాతన.. చివరికి వ్యభిచారిగా కూడా

280

దిశ, వెబ్ డెస్క్: ఎంతగానో ఇష్టపడి పెళ్లిచేసుకున్నారు ఒక జంట.. కలతలు లేని కాపురం .. వారి ప్రేమకు గుర్తుగా పండంటి పాప జన్మించింది. ఎంతో సంతోషంగా ఉందనుకుంటున్న కాపురంలో కలతలు ప్రారంభమయ్యాయి. ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ ద్వేషంగా మారింది. చిన్న చిన్న గొడవలు పెట్టుకొని భర్తను వదిలి పుట్టింటికి వచ్చేసింది భార్య. ఇదంతా ప్రతి ఆలుమగల మధ్య జరిగేదే.. కానీ భర్త పేరు చెప్పి ఆ మహిళను మోసం చేసాడు ఒక కిరాతకుడు. పుట్టింటికి వచ్చిన ఆమెను భర్త పిలుస్తున్నాడని చెప్పి తీసుకెళ్లి వ్యభిచార కూపంలోకి లాగాడు. ఆమె అతని నుండి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించన ఘటన మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలో వెలుగు చూసింది.

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెం గ్రామానికి చెందిన ఓ యువకుడు, భద్రాచలం సమీపంలోని ఎటపాకకు చెందిన ఓ గిరిజన మహిళను మూడేళ్ళ క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల పాప. అయితే కొన్ని మనస్పర్థల కారణంగా యువతి తన పుట్టింటికి పాప తో కలిసి వచ్చేసింది. భర్తే తిరిగి వచ్చి తీసుకెళ్తాడని ఎదురుచూస్తుంది. ఇంతలో యువతికి పరిచయమున్న సర్వేశ్ అనే వ్యక్తి తన భర్త పిలుస్తున్నాడని చెప్పడంతో తెలిసిన అన్ననే కదా అని నమ్మి అతనితో పాటు వెళ్ళింది. ఆమెను హైదరాబాద్ లోని ఒక రూమ్ లో రెండు రోజులు ఉంచాడు.

ఆ తర్వాత అనుమానమొచ్చిన ఆమె సర్వేశ్ ని నిలదీసింది. దీంతో అసలు రంగు బయటపెట్టిన అతడు యువతిని చిత్ర హింసలు పెట్టడం మొదలు పెట్టాడు. ఆమె దగ్గర ఉన్న నగదు, బంగారాన్ని లాక్కుని వ్యభిచారిగా మార్చాడు. రోజూ సిగరెట్లతో కాలుస్తూ వ్యభిచారం చేయాలనీ బలవంత పెట్టాడు..లేకపోతే పాపను చంపేస్తానని బెదిరించాడు. పాపను సైతం వదలకుండా మద్యం మత్తులో ఆమె వీపుపై సిగరెట్లతో కాల్చి రాక్షసానందం పొందేవాడు. ఈ నరకయాతన భరించలేని యువతి అద్దె గది యజమాని సాయంతో అక్కడినుండి బయటపడి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..