వ్యక్తిగత రుణాలకే మొగ్గు చూపిన మహిళలు!

by  |
personal loans
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి సమయంలో మహిళలు గృహ రుణాలు, వాహన రుణాల కంటే వ్యక్తిగత రుణాలనే ఎక్కువమంది తీసుకున్నారని గురువారం ఓ నివేదిక తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ వరకు తొమ్మిది నెలల కాలంలో వ్యక్తిగత రుణాలు తీసుకున్న మహిళల సంఖ్య 23 శాతం పెరిగిందని, గృహ రుణాలు 5 శాతం పెరిగాయని ప్రముఖ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సంస్థ సీఆర్ఐఎఫ్ హై మార్క్ వెల్లడించింది. 2020లో కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో దేశంలో చాలామంది తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నారని దీంతో మహిళలు రిస్క్ ఉన్నప్పటికీ వ్యక్తిగత రుణాలను ఆశ్రయించారని నివేదిక అభిప్రాయపడింది. వ్యక్తిగత రుణాల విభాగంలో యాక్టివ్‌గా ఉన్న రుణాలు 4,354 ఉండగా, గృహ రుణాలు 6,482, వాహన రుణాలు 1,818 ఉన్నాయని, వాహన రుణాలు క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 4 శాతం క్షీణించాయని నివేదిక స్పష్టం చేసింది.

మొత్తం వ్యక్తిగత, వాహన రుణాల్లో మహిళల వాటా ప్రస్తుతం 1 శాతం పెరిగి 16 శాతానికి చేరుకుందని, గృహ రుణాల్లో మహిళల వాటా 29 శాతంగా ఉంది. కరోనా మహమ్మారి సమయంలో అంటే 2020-21లో మొదటి మూడు త్రైమాసికాల్లో మొత్తం 1.8 కోట్ల రుణాలు(పురుషులు, మహిళలు) మంజూరు అయ్యాయి. ఇందులో 18 లక్షల వాహన రుణాలు, 15 లక్షల గృహ రుణాలు, 1.5 కోట్ల వ్యక్తిగత రుణాలు ఉన్నాయి. ఇక, 2020లో మహిళలకు ఇచ్చిన మొత్తం రుణాల పంపిణీలో 40 శాతం వాటాను 26-35 ఏళ్ల వయసు మహిళ సంఖ్య గరిష్ఠంగా ఉందని, ప్రస్తుతం దేశంలో 6.26 కోట్ల మహిళా రుణగ్రహీతలు ఉన్నారని నివేదిక వెల్లడించింది.


Next Story

Most Viewed