పూల మాలతో పంత్‌కు గ్రాండ్ వెల్‌కమ్..

92
rishab-pantr

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులోని రిషబ్ పంత్ కరోనా బారిన పడి కోలుకున్నాడు. వరుసగా చేసిన రెండు ఆర్టీ-పీసీఆర్ టెస్టుల్లో నెగెటివ్ రావడంతో అతడు గురువారం భారత జట్టు బస చేస్తున్న దుర్హామ్‌కు చేరుకున్నాడు. రిషబ్ పంత్ రాకతో భారత జట్టు శిబిరంలో సంతోషం నెలకొన్నది. ముఖ్యంగా హెడ్ కోచ్ రవిశాస్త్రి అత్యంత సంతోషంగా అతడి మెడలో పూల దండ వేసి వెల్కమ్ చెప్పాడు.

గురువారం నాడే రిషబ్ పంత్ భారత జట్టు బయోబబుల్‌లోకి ప్రవేశించాడు. దుర్హామ్‌లో జరుగనున్న రెండో వార్మప్ మ్యాచ్‌కు పంత్ అందుబాటులో ఉండనున్నాడు. ‘హార్ కే బాద్ జీత్ హై.. ఔర్ జీత్‌నే వాలోంకే కెహెతే హై బాజీ అగర్’ అంటూ హిందీలో కోట్ పెట్టి పంత్, రవిశాస్త్రి కలసి దిగిన ఫొటోను ఇన్‌స్టాలోపోస్టు చేశాడు. మరోవైపు అభిమన్యు ఈశ్వరన్, వృద్దిమాన్ సాహ, భరత్ అరుణ్ ఐసోలేషన్ శనివారంతో పూర్తవుతుంది. దయానంద్ గరాని మరి కొన్ని రోజులు ఐసోలేషన్‌లో గడపనున్నాడు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..