సినిమాలకు వెంకటేష్ గుడ్ బై.. కారణం అదేనా..?

by  |
సినిమాలకు వెంకటేష్ గుడ్ బై.. కారణం అదేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ లో వివాదాలు లేని, ఫ్యాన్ వార్ లేని హీరో ఎవరు అంటే టక్కున దగ్గుబాటి వెంకటేష్ అని చెప్పేస్తారు. దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా అడుగుపెట్టిన వెంకీ.. విక్టరీనే ఇంటిపేరుగా మార్చుకొని విక్టరీ వెంకటేష్ గా అంచలంచెలుగా ఎదిగాడు. ఇక ఆయన చేసినన్ని రీమేక్లు టాలీవుడ్ లో ఎవరు చేయలేదంటే అతిశయోక్తి కాదు. అంతేకాకుండా కుర్ర హీరోలతో జతకట్టి మల్టీ స్టారర్ లకు నాంది పలికింది కూడా వెంకీమామనే. కుర్ర హీరోలకు పోటీగా ఇప్పటికీ ఏడాదికి మూడు సినిమాలను రిలీజ్ చేయడం మాములు విషయం కాదు. ఇక తాజాగా వెంకటేష్ తన సినీ కెరీర్ కి ఫుల్ స్టాప్ పెడుతున్నాడని టాలీవుడ్ వర్గాల సమాచారం.

ప్రస్తుతం వెంకీ మామ చేతిలో ‘దృశ్యం 2’, ‘ఎఫ్ 3’ చిత్రాలు ఉన్నాయి. వీటిని పూర్తి చేసిన తర్వాత వెంకీ కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ఈ పుకార్లు రావడానికి కూడా కారణం లేకపోలేదు. ఇటీవల కొంతమంది దర్శకులు కథలు చెప్పడానికి వెళితే.. వెంకీ సున్నితంగా తిరస్కరించాడని, ఇప్పట్లో కథలు వినే మూడ్ లేదని తెలిపినట్లు సమాచారం. అంతేకాకుండా షూటింగ్స్ వలన ఫ్యామిలీ ని మిస్ అవుతున్నానే ఫీలింగ్ తో కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని వారితో హ్యాపీ గా గడపాలనుకొంటున్నట్లు తెలుస్తోంది.

ఇక వెంకటేష్ కోసం తరుణ్ భాస్కర్ ఒక కథ రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఆ కథ ఇంకా పూర్తి కాకపోవడంతో కొన్నాళ్లు వేరే స్క్రిప్టులకు ఓకే చెప్పకూడదని నిర్ణయించుకున్నారన్న మాటా వినిపిస్తోంది. ఏదిఏమైనా వెంకీ మామ షాకింగ్ డెసిషన్ అభిమానుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఎటువంటి వర్గాలనైనా థియేటర్స్ రప్పించే సత్తా ఉన్న వెంకీ సడెన్ గా సినిమాలకు బ్రేక్ ఇస్తే.. మంచి ఫ్యామిలీ మూవీస్ ని మిస్ అవుతామని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి అభిమానుల కోరికమేరకైన వెంకీ తన నిర్ణయం మార్చుకొంటాడేమో చూడాలి.

Next Story