అధికారముందని అహంకారమా.. ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే దాడి చేస్తారా.?

by  |
janagoan
X

దిశ, జనగామ : ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం నేరమా?. అధికారముందని అహంకారంతో కళ్లు మూసుకుపోయిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి కళ్లు తెరిపిస్తామని కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి అన్నారు. జిల్లాలోని నర్మెట్ట మండలం రత్నతండలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గోని మాట్లాడారు.

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని అన్నారు. తండావాసులకు రోడ్డు సౌకర్యం కావాలని ఎమ్మెల్యేను ప్రశ్నించడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. 5 సంవత్సరాలకు ఒక సారి వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగిన నాయకులని అడగకపోతే.. ఇంకెవరిని అడగాలని అన్నారు. రోడ్డు కావాలని నిరసన తెలిపిన తండావాసులపై టీఆర్ఎస్ నేతలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

తండావాసులపై దాడికి పాల్పడిన టీఆర్ఎస్ నేతలపై వెంటనే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుని గిరిజన వాసులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా టీఆర్ఎస్ నేతలు అహంకారంతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వారంలోగా తండావాసులకు రోడ్డు సౌకర్యం కల్పించాలన్నారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రమదానం చేపట్టి తండావాసులకు అండగా నిలుస్తామన్నారు. కార్యక్రమంలో ఎర్రమల్ల సుధాకర్, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, మేడా శ్రీనివాస్, దయాకర్ రెడ్డి, శివరాజ్ యాదవ్, తదితరులు ఉన్నారు.

janagoan2



Next Story

Most Viewed