పరాయి స్త్రీతో భర్త ట్విస్ట్.. మా ఆయన బంగారం అంటూ భార్య పొగడ్తల వర్షం

by  |
పరాయి స్త్రీతో భర్త ట్విస్ట్.. మా ఆయన బంగారం అంటూ భార్య పొగడ్తల వర్షం
X

దిశ,వెబ్‌డెస్క్: తాను ఇంట్లో లేనప్పుడు భర్త పరాయి స్త్రీ తో సాన్నిహిత్యంగా ఉన్నాడనే అనుమానంతో భార్య.., తన భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. కానీ అక్కడ జరిగిన ట్విస్ట్ కు భార్య ఫీజులు ఎగిరి పోయాయి. ఎందుకో తెలుసా?
మాగీ క్లేటన్ అనే మహిళ ఓ పని నిమిత్తం బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చింది. అయితే మాగీ ఇంటి సమీపంలో ఉండగా తన ఇంట్లో నుంచి పెద్దగా మ్యూజిక్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఆశ్చర్యపోయిన మహిళ ఇంటి బయటరహస్యంగా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. అంతే ఇంట్లో జరిగే సీన్ చూసిన భార్య షాకైంది. ఓ మహిళతో భర్త సాన్నిహిత్యంగా ఉంటున్నాడని నిర్ధారించుకుంది. అంతేకాదు భర్త యవ్వారాన్ని బట్టబయలు చేయాలని రహస్యంగా వీడియో షూట్ చేసింది. కానీ ఎదో అనుకుంటే ఇంకేదో అయినట్లు.. వీడియో తీసుకుంటూ వెళ్లిన భార్యకు.., భర్త స్వీట్ షాక్ ఇచ్చాడు. ఇంట్లో పరాయి స్త్రీ ఎవరూ లేరు. భర్తే విగ్ తగిలించుకొని రాక్ స్టార్ అవతారం ఎత్తాడు. దీంతో ఏం మాట్లాడాలో తెలియక మా ఆయన బంగారం అంటూ భార్య పొగడ్తల వర్షం కురిపించింది. మీరు నన్ను ఆటపట్టించాలని అనుకున్నారు కదూ.., నేను మిమ్మల్ని చూసి అమ్మాయి అనుకున్నానని చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటి వరకూ ఆ వీడియోను 3 మిలియన్ల కంటే ఎక్కువ మంది వీక్షించారు.


Next Story

Most Viewed