అనుమతిచ్చినా సినిమాలు ఎందుకు రిలీజ్ చేయడం లేదు..?

by  |
cs-somesh-kumar 1
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా లాక్‌డౌన్ ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినా కొత్త సినిమాలను ఎందుకు విడుదల చేయడంలేదని నిర్మాతలను ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రశ్నించారు. థియేటర్లను కూడా ఎందుకు తెరవలేదని ప్రశ్నించారు. సచివాలయంలో ప్రధాన కార్యదర్శితో నిర్మాతలు దిల్ రాజు, దగ్గుబాటి సురేశ్, దామోదర ప్రసాద్ తదితరులు సోమవారం భేటీ అయిన సందర్భంగా పై అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. దీనికి స్పందించిన నిర్మాతలు, ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్లు ఇంకా ప్రారంభించలేదని, అక్కడ పరిస్థితి అనుకూలంగా ఉంటే తప్ప కొత్త సినిమాలను విడుదల చేయడం సాధ్యం కాదని వివరించారు.

దీనికి తోడు థియేటర్లలో దాదాపు 40 శాతం ఆదాయం వాహనాల పార్కింగ్ ద్వారానే సమకూరుతుందని, ప్రస్తుతం ‘ఫ్రీ పార్కింగ్‘ విధానం అమలవుతున్నందున నష్టం వస్తున్నదని సీఎస్‌కు వివరించారు. అన్ని థియేటర్లలో ‘పెయిడ్ పార్కింగ్‘ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. థియేటర్లకు వస్తున్న ఆదాయం తగ్గిపోవడానికి ‘ఫ్రీ పార్కింగ్‘ విధానంతో పాటు టికెట్ ధరలు తక్కువగా ఉండడం కూడా మరో కారణమని వివరించారు. నిర్మాతల డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న సీఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్‌‌తో మాట్లాడిన తర్వాత ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తామని వివరించారు.

Next Story

Most Viewed