మగాళ్ల తక్కువ ఆయుష్షుకి కారణం ఇదే!

by  |
మగాళ్ల తక్కువ ఆయుష్షుకి కారణం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్:

ఆడవాళ్ల కంటే మగవాళ్లు తక్కువ కాలం జీవిస్తారని చాలా మందికి తెలిసిన విషయమే. అయితే దీని వెనక కారణాలు మాత్రం బోలెడు ఉన్నాయి. మగవాళ్లు ఎక్కువ రిస్కు తీసుకునే పనులు చేస్తారు, ఎక్కువ ఆల్కహాల్ తాగుతారు, స్మోకింగ్ చేస్తారు అంటూ నోటి మాట కారణాలు వంద చెప్తారు. కానీ శాస్త్రయోక్తంగా సరైన సమాధానం ఇప్పటికీ లేదు. కానీ ఇటీవల సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ (యూఎన్ఎస్‌డబ్ల్యూ) శాస్త్రవేత్తలు మాత్రం ఇందుకు కారణం క్రోమోజోములని కనిపెట్టేశారు.

క్రోమోజోములు అంటే?

మానవ శరీరం కణాల సమ్మిళితం. ప్రతి కణంలోనూ కేంద్రకం ఉంటుంది. ఆ కేంద్రకంలో జన్యువులతో కూడిన క్రోమోజోములు ఉంటాయి. ఈ క్రోమోజోముల ఆధారంగా మనిషి లింగం, రంగు, రూపు, రక్తం తీరు నిర్ణయమవుతాయి. మానవ కణంలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. వాటిలో ఒక జతను సెక్స్ క్రోమోజోములు. ఈ క్రోమోజోములే మనిషి జెండర్ నిర్ణయిస్తాయి. ఆడవాళ్లకి ఎక్స్‌వై, మగవాళ్లకి ఎక్స్ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి.

అన్‌గార్డెడ్ ఎక్స్ హైపోథెసిస్

శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ అన్‌గార్డెడ్ ఎక్స్ హైపోథెసిస్‌లో ఎక్స్‌వై క్రోమోజోమ్ జతలో ఉన్న వై క్రోమోజోమ్ చాలా బలహీనంగా ఉంటుంది. దీంతో చెడు కలిగించే జన్యువులన్నీ ఎక్స్ క్రోమోజోమ్ మీద దాడిచేయగలుగుతాయి. కానీ ఆడవాళ్ల రెండు ఎక్స్‌ క్రోమోజోములు బలంగా ఉండటం వల్ల ఒక ఎక్స్ క్రోమోజోమ్, మరో ఎక్స్ క్రోమోజోమ్‌ని చెడు జన్యువుల దాడిని నియంత్రించగలుగుతుంది. అందుకే ఆడవాళ్లు, మగవాళ్ల కంటే తక్కువగా జబ్బుపడి, ఎక్కువ కాలం జీవించగలుగుతారు.

పరిశోధన ఎలా సాగింది?

ఈ హైపోథెసిస్ రచయితల్లో ఒకరైన జోయి క్సిరోకోస్టాస్ వారి పరిశోధన సాగిన విధానం గురించి కూలంకషంగా వివరించారు. కేవలం మనుషుల మీద మాత్రమే పరిశోధన చేసి ఈ విషయాన్ని ధ్రువీకరించలేదని, ఇతర క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, బొద్దింకలు, కందిరీగల మీద కూడా పరిశోధించి ఈ విషయం కనిపెట్టినట్లు జోయి చెప్పారు. సీతాకోకచిలుకల్లో జెడ్‌జెడ్ క్రోమోజోముల జత ఉన్న మగ సీతాకోకచిలుకలు తక్కువ కాలం బతకగా, జెడ్‌డబ్ల్యూ క్రోమోజోమ్ జత ఉన్నవి ఎక్కువ కాలం జీవిస్తున్నాయని వారు కనిపెట్టారు. అయితే మానవుల విషయంలో ఆడవాళ్లు 21 శాతం ఎక్కువ జీవిస్తుండగా, సీతాకోకచిలుకల్లో అది కేవలం 7 శాతమేనని వారు వెల్లడించారు.

tags : Chromosomes, Human, Male, Female, Cockroaches, XY, XX, ZZ, ZW, UNSW


Next Story

Most Viewed