సెలబ్రిటీ చనిపోతే.. పర్సనల్ లాస్‌గా ఎందుకు ఫీలవుతాం?

by  |
సెలబ్రిటీ చనిపోతే.. పర్సనల్ లాస్‌గా ఎందుకు ఫీలవుతాం?
X

దిశ, వెబ్‌డె‌స్క్ : ‘మరణ వార్త’ అనేది.. ఎవరినైనా ఓ రకంగా షాక్‌కు గురిచేస్తుంది. అందులోనూ ‘సెలబ్రిటీ’ చనిపోయాడంటే.. మన మనసుకు దగ్గరైన వారెవరో ఈ లోకం విడిచి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. మనం ఆ స్టార్ నటించిన సినిమాలన్నీ చూసుండకపోవచ్చు. ఆయనకు వీరాభిమాని కూడా కాకపోవచ్చు. కానీ సడన్‌గా ‘హీ ఈ జ్ నో మోర్’ అని వినగానే.. అక్కడే స్ట్రక్ అయిపోతాం. ఎందుకు ఇలా జరుగుతుంది? అతనికి మనం కంప్లీట్‌గా స్ట్రేంజర్ అయినా.. మనల్ని ఆ బాధ ఎందుకు వెంటాడుతుంది ?

ఇటీవలి కాలంలో.. ‘ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్’ వంటి గొప్ప నటులను కోల్పోయాం. కన్నడ హీరో ‘చిరంజీవి సర్జా’ కూడా కొద్ది రోజుల కిందటే మృతి చెందగా.. రీసెంట్‌గా ‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్’. వీరంతా కూడా సెలబ్రిటీలే. మరి వీళ్లతో మనకు ఎటువంటి పర్సనల్ అటాచ్‌మెంట్ ఉండదు. ఇంకా చెప్పాలంటే వాళ్ల రీల్ లైఫ్ తప్ప.. రియల్ లైఫ్‌లో ఎలా ఉంటారో అసలే తెలియదు. కానీ మన జీవితాల్లో వారి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. ఏ నటుడైనా చనిపోతే.. మన స్నేహితుడో లేదా దగ్గరి వ్యక్తో చనిపోయాడని ఫీలవుతాం. వారి ఫొటోలు, నటించిన సినిమాలు మాత్రమే వాళ్లని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తుంటాయంటే కాదని చెప్పలేం.

జర్నీ విత్ సెలబ్రిటీ..
వెండితెర లేదా బుల్లితెరపై సెలబ్రిటీలను కాసేపు చూసినా సరే.. మనకు తెలియకుండానే వారితో ఓ జర్నీ మొదలవుతుంది. అంతేకాక వాళ్లు నటించిన క్యారెక్టర్ నుంచి ఎంతో కొంత స్ఫూర్తి పొందుతూ ఉంటాం. వెండితెరపై అభిమాన తారలను చూసి నవ్వుకుంటాం.. ఏడుస్తాం.. వారి విజయాన్ని మన సక్సెస్‌లా ఫీల్ అవుతాం. సినిమా ఫెయిల్ అయితే వారనుభవించే బాధను మనమూ అనుభవిస్తాం. రీల్ లైఫ్‌లో జరిగే సన్నివేశాలను మన రియల్ లైఫ్‌కూ అన్వయించుకుంటాం. ‘ఇది మన కథే. ఇలా నాక్కూడా జరిగిందే’ అని మనకు మనమే చెప్పుకుంటాం. వెండితెరపై ఆ స్టార్ ప్లేస్‌లో మనల్ని ఊహించుకుంటాం. అలా సెలబ్రిటీలు మన జీవితంలోకి చెప్పకుండానే వచ్చేస్తారు. మనతో కలిసి జీవిస్తారు. ఆ ట్రావెల్ అలా నిశ్శబ్దంగా సాగుతూనే ఉంటుంది. అలాంటి టైమ్‌లో ఆ సెలబ్రిటీ ఇక లేడనే వార్త వినగానే.. మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. గుండె బరువెక్కుతుంది. కాసేపు ఏం చేయాలో అర్థం కాదు. ఒక్కసారిగా ఆ నిశ్శబ్ద జర్నీ అక్కడితో ఆగిపోతుంది. దాంతో ఎమోషన్ ఫీలింగ్ మరింత పెరుగుతుంది. అందుకే వారు చనిపోతే పర్సనల్ లాస్‌గా ఫీల్ అవుతాం. దానికి తోడు.. టీవీలో వచ్చే బ్రేకింగ్ న్యూస్‌లు, ఆ వ్యక్తి గురించి వచ్చే కథనాలు, అతడి పర్సనల్ లైఫ్ విశేషాలు.. ఇంకా ఇంకా బాధను రెట్టింపు చేస్తాయి.

ఓవర్‌కమ్..
సెలబ్రిటీ అనే కాదు.. ఎవరి మరణమైనా బాధను కలిగిస్తుంది. వారితో ఉన్న అటాచ్‌మెంట్ తెగిపోవడంతో చాలా పెయిన్‌పుల్‌ ఫీలింగ్ ఉంటుంది. కానీ వాస్తవాన్ని గ్రహించాలి. సాధ్యమైనంత తొందరగా మన లైఫ్‌లోకి వచ్చేయాలి. బాధ నుంచి బయటపడేందుకు కొద్ది రోజుల పాటు ఖాళీ లేకుండా బిజీగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఒంటరిగా ఉండకుండా.. మనుషుల మధ్య గడపాలి.

మన ఫ్యామిలీకి మనం ఎంత ముఖ్యమో కూడా ఆలోచించాలి. మనం సంతోషంగా ఉంటేనే పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు. అనవసర ఒత్తిడికి లోనుకాకుండా.. మెంటల్ హెల్త్‌ను కాపాడుకుంటూ.. ఆరోగ్యంగా ఉండాలి. అది మనకు.. మన కుటుంబానికి కూడా ఎంతో శ్రేయస్కరం.

Next Story