ఏపీలో జూన్ 4 తర్వాత కూడా కేంద్ర బలగాలు.. సీఈసీ సంచలన నిర్ణయం

by srinivas |
ఏపీలో జూన్ 4 తర్వాత కూడా కేంద్ర బలగాలు.. సీఈసీ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికలు జరిగాయి. పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో పల్నాడు, అనంతపురం జిల్లాల్లో సహా చాలా ప్రాంతాల్లో అలర్లు జరిగాయి. వైసీపీ, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో రెండు పార్టీలకు చెందిన చాలా మందికి గాయాలయ్యాయి. ఎన్నికల పోలింగ్ తర్వాత సైతం పలుచోట్ల ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో భద్రత విషయంలో పోలీసులు వైఫల్యం చెందారనే ఆరోపణలు చెలరేగాయి. ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ మేరకు ఏపీ సీఎస్, డీజీపీతో సమీక్ష నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లోని పోలీస్ ఉన్నతాధికారులపై చర్యలకు దిగింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలను సస్పెండ్ చేసింది. మళ్లీ ఉద్రిక్తతలు చోటు అవకాశం ఉందని అంచనా వేసింది. ఎన్నికల ఫలితాలు విడుదల అయిన 15 రోజుల వరకూ రాష్ట్రంలో కేంద్రబలగాలను కొనసాగించాలని ఆదేశించింది. అవసరమైతే మరిన్ని బలగాలనూ వినియోగించుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్రహోంశాఖకు ఆదేశించింది.

Read More...

BREAKING: రాష్ట్ర పోలీసు శాఖలో సంచలనం.. మూకుమ్మడిగా సిబ్బందిపై ఈసీ బదిలీ వేటు

Next Story

Most Viewed