అక్షర్ పేరు ఇంగ్లీషులో ఎందుకు అలా ఉంది?

by  |
అక్షర్ పేరు ఇంగ్లీషులో ఎందుకు అలా ఉంది?
X

దిశ, స్పోర్ట్స్ : జాతీయ జట్టులోకి లేటుగా వచ్చినా తన స్పిన్‌తో ఇంగ్లాండ్ జట్టును ముప్పతిప్పలు పెట్టి రెండు టెస్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు అక్షర్ పటేల్. తన ఆర్మ్ బౌలింగ్‌తో బంతిని సుడులు తిప్పుతూ ప్రత్యర్థి జట్టు వికెట్లు వరుసగా పడగొట్టాడు. అయితే అక్షర్ పటేల్ పేరు ఇంగ్లీషులో ‘Axar’ అని ఉంటుంది. సాధారణంగా ఇండియాలో అక్షర్ అనే పేరును ఇంగ్లీషులో ‘Akshar’ అని రాస్తారు. కానీ టీమ్ ఇండియా క్రికెటర్ అక్షర్ పటేల్ పేరు మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది.

దీనిపై అక్షర్ స్పష్టత ఇచ్చాడు. మీడియాలో గానీ, సోషల్ మీడియాలో గానీ తన పేరును ‘Akshar’ అని మాత్రమే రాయమని కోరాడు. గుజరాత్‌లోని ఆనంద్‌లో ఒక ఆసుపత్రిలో అక్షర్ పుట్టినప్పుడు.. తల్లి ప్రీతి తన కొడుకు పేరును అక్షర్ అని చెప్పగా.. ఆసుపత్రి నర్స్ ఇంగ్లీషులో ‘Axar’ అని తప్పుగా రాసింది. అప్పటి నుంచి అందరూ అదే స్పెల్లింగ్ వాడుతున్నారు. అయితే ఐసీసీ, బీసీసీఐ రికార్డుల్లో మాత్రం ‘Akshar’ అనే స్పెల్లింగే వాడుతున్నారు.


Next Story

Most Viewed