కరోనాపై పోరాడుదాం -WHO

by  |
కరోనాపై పోరాడుదాం -WHO
X

రోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంది. ఇప్పటికే ఈ మహమ్మారి 25 దేశాలకు పైగా వ్యాపించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది.కరోనాను నిర్మూలించేందుకు వైరస్ ప్రభావిత ప్రాంతాలు.. విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చింది. మొత్తంగా 675 మిలియన్ డాలర్ల వరకు ఇవ్వా్ల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. వీటి ద్వారా అంతర్జాతీయ సమన్వయంతో, కార్యచరణను వేగవంతం చేయవచ్చని అభిప్రాయపడింది. అటు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, ప్రతిస్పందన కార్యకలాపాలను పెంచాలని నిర్ణయం తీసుకుంది. కరోనాపై రిసెర్చ్ కోసం ఈ వనరులు సమకూర్చాలని WHO ప్రపంచ దేశాలకు సూచించింది. కొన్ని ప్రాంతాల్లో వైరస్ బారిన పడిన వ్యక్తులను గుర్తించేందుకు వ్యవస్థలు కూడా లేవని ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని గుర్తించి, తగు చర్యలు తీసుకోవడానికి అత్యవసర మద్దతు అవసరమని WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెట్రోస్ అధనామ్ తెలిపారు. చైనాతో సహా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మృతుల సంఖ్య 550 దాటేసింది. మరో 28000 మందికి వైరస్ సోకినట్లు సమాచారం.

Next Story

Most Viewed