'ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెండు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలి'

by Aamani |
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు  రెండు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలి
X

దిశ,హనుమకొండ టౌన్ : వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కు జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెండు నెలల పెండింగ్ వేతనాలు అనగా మార్చి , ఏప్రిల్ వేతనాలు వెంటనే చెల్లించాలని వినతి పత్రం ఏఐటియుసి ట్రేడ్ యూనియన్ నేషనల్ హెల్త్ మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఆర్.బీ.ఏస్. కె డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ గుండా రవీందర్ వినతి పత్రం ఏడు నెలల పీఆర్సీ ఏరియర్స్ ఇవ్వాలని అందజేశారు. ఆర్వి కర్ణన్ కమిషనర్ ఈ విషయమై మాట్లాడుతూ సాధ్యమైనంత పరిష్కారం దిశగా జీతాలు చెల్లిస్తారని ఉద్యోగులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ బీఎస్.కే. డాక్టర్స్ అసోసియేషన్ కోశాధికారి డాక్టర్ దుర్గాప్రసాద్, మేనేజర్ మెరుగు అనిల్ కుమార్ , ఎన్ హెచ్ ఎం రాష్ట్ర ఎగ్జిట్ కమిటీ మెంబర్ నురా సంపత్ కుమార్ , సైకాలజిస్ట్ ప్రశాంత్, ఫిజియోథెరపిస్ట్ పవన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed