ఫోర్త్ ఫేజ్ లోక్ సభ ఎన్నికల పోలింగ్ పర్సంటేజ్ ప్రకటించిన ఈసీ.. ఎంత శాతమంటే..?

by Satheesh |
ఫోర్త్ ఫేజ్ లోక్ సభ ఎన్నికల పోలింగ్ పర్సంటేజ్ ప్రకటించిన ఈసీ.. ఎంత శాతమంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ తుది పర్సంటేజ్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. నాలుగో దశ లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 69.16 పోలింగ్ శాతం నమోదు అయినట్లు ఈసీ వెల్లడించింది. ఫోర్త్ ఫేజ్‌లో దేశంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో 80.66 శాతం పోలింగ్ నమోదైనట్లు కాగా జమ్ము కాశ్మీర్‌లో అత్యల్పంగా 38.49 శాతం నమోదైనట్లు ప్రకటించింది.

కాగా, తెలంగాణలో సైతం నాలుగో దశలోనే 17 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక, 2024 సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరగనున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ పూర్తి అయ్యింది. మరో మూడు దశల ఎన్నికలు జరగాల్సి ఉంది. జూన్ 1వ తేదీన లాస్ట్ ఫేజ్ ఎన్నికలు జరగనుండగా.. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Next Story

Most Viewed