ఐపీఎల్ నుంచి ఆటగాళ్లకు విడుదల

by  |
ఐపీఎల్ నుంచి ఆటగాళ్లకు విడుదల
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ కసరత్తు ప్రారంభమైంది. లీగ్‌లో ఉన్న ఎనిమిది ఫ్రాంచైజీలు ఎవరెవరిని జట్టుతో ఉంచుతారు? ఎవరిని విడుదల చేస్తారనే దానిపై విధించిన గడువు ఈ రోజుతో ముగియనుంది. గత ఏడాది ప్రదర్శన.. రాబోయే ఐపీఎల్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఫ్రాంచైజీలు నిర్ణయాలు తీసుకున్నాయి. ఫిబ్రవరి 11న మినీ వేలానికి ముందు జట్టులో భారంగా ఉన్న క్రికెటర్లను పలు ఫ్రాంచైజీలు వదిలేశాయి. అలాగే జట్టు అవసరాల మేరకు మినీ వేలంలో పాల్గొనడానికి సిద్దపడుతున్నాయి. ఈ వేలం ఈ ఒక్క సీజన్‌కు మాత్రమే కావడంతో బీసీసీఐ కూడా పర్స్ వాల్యూను రూ. 85కోట్లుగానే ఉంచేసింది. కొన్ని ఫ్రాంచైజీలు పర్స్ వాల్యూ పెంచమని కోరినా.. బీసీసీఐ నిరాకరించింది. దీంతో ఉన్న ఆటగాళ్లనే విడుదల చేసి కొత్త ఆటగాళ్ల కొనుగోలుకు అవసరమైన నిధులను సమకూర్చుకుంటున్నాయి.

రైనా చెన్నైతోనే..

గత సీజన్‌లో ఐపీఎల్ ఆడటానికి యూఏఈ వెళ్లిన సురేష్ రైనా.. అక్కడి నుంచి అకస్మాతుగా తిరిగి వచ్చేశాడు. 2020 సీజన్ ఆడటం లేదని తేల్చి చెప్పాడు. అంతకు ముందే హర్బజన్ సింగ్ కూడా ఐపీఎల్‌కు దూరమవుతున్నట్లు చెప్పారు. కాగా, రైనాను జట్టు నుంచి తప్పించారని.. కాంట్రాక్టు కూడా పొడిగించట్లేదనే వార్తలు వచ్చాయి. అయితే రైనా తమ జట్టులోనే ఉంటాడని.. అతడిని విడుదల చేయట్లేదని చెప్పింది. హర్బజన్ సింగ్‌తో కాంట్రాక్టును పొడిగించట్లేదని కూడా సీఎస్కే చెప్పింది.

ముఖ్యంగా కేదార్ జాదవ్, పీయుష్ చావ్లా, ఇమ్రాన్ తాహిర్, మురళీవిజయ్, జోష్ హాజెల్‌వుడ్, కరన్ శర్మలను సీఎస్కే విడుదల చేయనుంది. వీరిలో కొంత మందితో తిరిగి కాంట్రాక్టు కుదుర్చుకునేందుకు కూడా సుముఖంగా లేదు. ఇక కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు మ్యాక్స్‌వెల్, కొట్రెల్, నీషమ్, ముజీబుర్ రహ్మాన్, గౌతమ్ వంటి వారిని విడుదల చేయాలని నిర్ణయించింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు జట్టు ఉద్వాసన పలికింది. గత ఏడాది జట్టును నడిపించడంలో విఫలమయ్యాడని చెబుతూ అతడిని విడుదల చేసింది. ఇక గబ్బాలో రాణించిన పంత్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్‌లు ఆయా ఫ్రాంచైజీలతోనే ఉండనున్నాను.

జట్ల వారీగా..

సీఎస్కే రిటైన్డ్ ప్లేయర్స్ : సురేష్ రైనా, ఎంఎస్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, నారాయన్ జగదీషన్, కేఎం ఆసిఫ్, జోష్ హాజెల్‌వుడ్, కరన్ శర్మ, అంబటి రాయుడు, దీపక్ చాహర్, ఫాఫ్ డు ప్లెసిస్, శార్దుల్ ఠాకూర్, మిచెల్ శాంట్నర్, డ్వేన్ బ్రావో, లుంగి ఎన్‌గిడి, సామ్ కరన్

సీఎస్కే రిలీజ్‌డ్ ప్లేయర్స్ : పీయుష్ చావ్లా, మురళీ విజయ్, హర్బజన్ సింగ్, కేదార్ జాదవ్, మోను కుమార్ సింగ్, షేన్ వాట్సన్ (రిటైర్డ్)

ఆర్సీబీ రిటైన్డ్ ప్లేయర్స్ : విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, యజువేంద్ర చాహల్, దేవ్‌దత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్ , మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, అడమ్ జంపా, షాబాజ్ అహ్మద్, జోష్ ఫిలిప్, కేన్ రిచర్డ్‌సన్, పవన్ దేశ్‌పాండే

ఆర్సీబీ రిలీజ్డ్‌ ప్లేయర్స్ : మొయిన్ అలీ, శివమ్ దూబే, గురుకీరత్ సింగ్ మన్, ఆరోన్ ఫించ్, క్రిస్ మోరిస్, పవన్ నేగీ, పార్థీవ్ పటేల్ (రిటైర్డ్), డేల్ స్టెయిన్, ఇరుసు ఉదాన, ఉమేష్ యాదవ్

ఆర్సీబీ ట్రేడ్ : డేనియల్ సామ్స్ (ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి)

ముంబయి ఇండియన్స్ రిటైన్డ్ : రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, క్వింటన్ డి కాక్, అనుమోల్ ప్రీత్ సింగ్, ఆదిత్య ఠారే, క్రిస్ లిన్, సౌరభ్ తివారి, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కిరాన్ పొలార్డ్, జయంత్ యాదవ్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రిత్ బుమ్రా, మోషిన్ ఖాన్, రాహుల్ చాహర్, , అనుకుల్ రాయ్

ముంబయి ఇండియన్స్ రిలీజ్డ్ ప్లేయర్స్ : లసిత్ మలింగ, షెఫానే రూథర్‌ఫర్డ్, నాథన్ కౌల్టర్ నైల్, జేమ్స్ పాటిన్సన్, మిచెల్ మెక్లింగన్, ప్రిన్స్ బల్వంత్ రాయ్, దిగ్విజయ్ దేశ్‌ముఖ్

కేకేఆర్ రిటైన్డ్ ప్లేయర్స్ : ఇయాన్ మోర్గాన్, దినేష్ కార్తిక్, నితీష్ రాణా, శుభమన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సునిల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, పాట్ కమ్మిన్స్, వరుణ్ చక్రవర్తి, లాకీ ఫెర్గూసన్, కుల్దీప్ యాదవ్, కమలేష్ నాగర్‌కోటి, శివమ్ మావీ, ప్రసిద్ద్ కృష్ణ, హారీ గర్నీ, సందీప్ వారియర్

కేకేఆర్ రిలీజ్డ్ ప్లేయర్స్ : టామ్ బాంటన్, క్రిస్ గ్రీన్, సిద్దేశ్ లాడ్, నిఖిల్ నాయక్, ఎం. సిద్దార్థ్

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ రిటైన్డ్ ప్లేయర్స్ : కేఎల్ రాహుల్, మన్‌దీప్ సింగ్, నికోలస్ పూరన్, క్రిస్ గేల్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, మయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమి, రవిబిష్ణోయ్, ఇషాన్ పోరెల్, మురుగన్ అశ్విన్, దర్శన్ నల్‌కాండే

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ రిలీజ్డ్ ప్లేయర్స్ : గ్లెన్ మ్యాక్స్‌వెల్, షెల్డన్ కొట్రెల్, క్రిష్ణప్ప గౌతమ్, ముజీబ్ ఉర్ రెహమాన్, జిమ్మీ నీషమ్, హార్డన్ విల్జోన్, కరున్ నాయర్

రాజస్థాన్ రాయల్స్ రిటైన్ట్ ప్లేయర్స్ : సంజూ శాంసన్, మన్నన్ వోహ్రా, డేవిడ్ మిల్లర్, జాస్ బట్లర్, యశస్వి జైస్వాల్, రాబిన్ ఊతప్ప, అనుజ్ రావత్, బెన్ స్టోక్స్, రాహుల్ తెవాతియా, మహిపాల్ లోమ్రోర్, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, జయదేవ్ ఉనద్కత్, కరిక్ త్యాగీ

రాజస్థాన్ రాయల్స్ రిలీజ్డ్ ప్లేయర్స్ : స్టీవ్ స్మిత్, ఓషానే థామస్, వరుణ్ ఆరోన్, టామ్ కర్రన్

ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్డ్ ప్లేయర్స్ : మార్కస్ స్టొయినిస్, శ్రేయస్ అయ్యర్, అజింక్య రహానే, శిఖర్ ధావన్, పృథ్వి షా, రిషబ్ పంత్, షిమ్రోన్ హిట్‌మెయర్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, క్రిస్ వోక్స్, ప్రవీన్ దూబే, అమిత్ మిశ్రా, కసోగి రబాడ, ఇషాంత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, అవేష్ ఖాన్, అన్రిచ్ నోర్జే

ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్డ్ ప్లేయర్స్ : జేసన్ రాయ్, అలెక్స్ కేరీ, సందీప్ లమిషానే, మోహిత్ శర్మ, డేనియల్ సామ్స్

సన్ రైజర్స్ హైదరాబాద్ రిటైన్డ్ ప్లేయర్స్ : డేవిడ్ వార్నర్, మనీష్ పాండే, కేన్ విలియమ్‌సన్, జానీ బెయిర్‌స్టో, వృద్దిమాన్ సాహ, శ్రీవత్స్ గోస్వామి, ప్రియమ్ గార్గ్, విరాట్ సింగ్, రషీద్ ఖాన్, విజయ్ శంకర్, మహ్మద్ నబీ, అభిషేక్ శర్మ, మిచెల్ మార్ష్, జేసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, టి, నటరాజన్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, బాసిల్ థంపీ, షాబాజ్ నదీమ్, సిద్దార్థ్ కౌల్, భువనేశ్వర్ కుమార్

సన్ రైజర్స్ హైదరాబాద్ రిలీజ్డ్ ప్లేయర్ : బిల్లీ స్టాన్‌లేక్, ఫాబియన్ ఆలెన్, సంజయ్ యాదవ్, బి సందీప్, వై పృథ్విరాజ్



Next Story