ఇదీ.. అంగారకుని ‘ఇన్‌సైట్’!

by  |
ఇదీ.. అంగారకుని ‘ఇన్‌సైట్’!
X

దిశ, వెబ్‌సైట్ :
అంగారక గ్రహం మీద నాసా వారు ఇన్‌సైట్ ల్యాండర్ మిషన్ ప్రారంభించి సంవత్సరం దాటి పోయింది. ఇప్పటివరకు మార్స్ గురించి ఇన్‌సైట్ పంపించిన సమాచారాన్ని నాసా విడుదల చేసింది. మొత్తం ఆరు పేపర్లలో ఉన్న ఈ సమాచారాన్ని నేచర్, నేచర్ జియోసైన్స్ జర్నల్స్ ద్వారా నాసా బయటపెట్టింది.

ఇన్‌సైట్ అంటే?

అంగారక గ్రహ ఉపరితలాన్ని లోతుగా పరిశీలించడానికి రూపొందించిన మిషన్ ఇన్‌సైట్. ఈ ల్యాండర్‌లో ప్రకంపనలు గుర్తించే సిస్మోమీటర్, గాలి పీడనం, తీవ్రతను గుర్తించే సెన్సార్లు, మాగ్నెటోమీటర్, గ్రహ ఉష్ణోగ్రతను గుర్తించే హీట్ ఫ్లో ప్రోబ్ ఉన్నాయి. నాసా వారి డిస్కవరీ ప్రోగ్రామ్‌లో ఇన్‌సైట్ మిషన్ ఒకభాగం. దీనికి ఫ్రెంచ్, జర్మన్, బ్రిటిష్ అంతరిక్ష సంస్థలు కూడా సహకరిస్తున్నాయి. అంగారక గ్రహానికి సంబంధించి ఉపరితలం మీద, లోపల, గాలి తీవ్రత వివరాలను ఈ ఇన్‌సైట్ ల్యాండర్ పంపించింది.

సాధారణ ప్రకంపనలే

అనుకున్నదాని కంటే ఎక్కువ సార్లే అంగారక గ్రహం మీద ప్రకంపనలు వస్తున్నాయని అల్ట్రా సెన్సిటివ్ సిస్మోమీటర్ రీడింగుల ద్వారా తెలిసింది. అయితే ఈ ప్రకంపనలు చాలా తక్కువ స్థాయి ప్రకంపనలు మాత్రమేనని నాసా తెలిపింది. అక్కడ టెక్టోనిక్ ప్లేట్స్ లేనప్పటికి ఉపరితలం అడుగున ఉన్న అగ్నిపర్వతాల వల్ల ఈ ప్రకంపనలు వస్తున్నాయని వారు చెప్పారు. వాటిలో అతిపెద్ద ప్రకంపన రెక్టర్ స్కేలు మీద 4.0గా నమోదైందని అన్నారు.

ఆకర్షణ శక్తి గల ఉపరితలం

బిలియన్ల సంవత్సరాల క్రితం అంగారకుని మీద అయస్కాంత శక్తి బలంగా ఉండేది. కానీ ఇప్పుడు దాని తీవ్రత తగ్గి ఆకర్షించే శక్తిగల రాళ్లుగా పరిణామం చెందిందని ఇన్‌సైట్ మాగ్నెటోమీటర్ పంపిన వివరాల ద్వారా తెలిసింది. హోమ్‌స్టెడ్ హ్యాలో అనే ప్రదేశంలో మాత్రం ఆకర్షణ తరంగాలు చాలా బలంగా ఉన్నాయని, వీటి కారణంగానే దాని చుట్టుపక్కల ఉన్న పర్వతాల్లో ఆకర్షణ శక్తి పెరిగిందని నాసా వెల్లడించింది. అయితే పగలు, రాత్రి రీడింగుల్లో చాలా తేడా ఎందుకు ఉందో శాస్త్రవేత్తలకు అర్థం కావడం లేదు.

ఇక గాలి తీవ్రత కూడా అధికంగానే ఉన్నప్పటికీ ఇన్‌సైట్ గాలి సెన్సార్లను ప్రభావితం చేయగల గాలి తరంగం ఇప్పటికీ దొరకలేదు. అలాగే ఇన్‌సైట్‌లో ఉన్న రెండు రేడియోల ద్వారా ఇప్పటివరకు పొందిన సమాచారం పెద్దగా ఉపయోగకరంగా లేకపోవడంతో ఇంకా ఈ ల్యాండర్ అంగారకుని మీద చాలా ప్రయాణం చేయాల్సి ఉందని నాసా వివరణ ఇచ్చింది.


Next Story

Most Viewed