ఈ రాశి వారు వారి నుంచి బహుమానాలు అందుకుంటారు

148

తేది : 15, సెప్టెంబర్ 2021
ప్రదేశము : హైదరాబాద్, ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : భాద్రపదమాసం
ఋతువు : వర్ష ఋతువు
వారము : బుధవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : నవమి (నిన్న మధ్యాహ్నం 1 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 19 ని॥ వరకు)
నక్షత్రం : మూల (నిన్న ఉదయం 7 గం॥ 6 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 55 ని॥ వరకు)
యోగము : సౌభాగ్యము
కరణం : కౌలవ
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 23 ని॥ నుంచి 5 గం॥ 54 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (నిన్న రాత్రి 11 గం॥ 49 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 20 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 46 ని॥ నుంచి మధ్యాహ్నం 12 గం॥ 34 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 10 ని॥ నుంచి 1 గం॥ 41 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 35 ని॥ నుంచి 9 గం॥ 6 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 4 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 18 ని॥ లకు
సూర్యరాశి : సింహము
చంద్రరాశి : ధనుస్సు

మేష రాశి : ఆశావాహ దృక్పథం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. మానసిక శారీరక ఆరోగ్యం కొరకు యోగా మెడిటేషన్ చేయండి. ఆదాయం పరవాలేదు. అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అధిక శ్రమ వలన వెన్ను నొప్పి. నూతన వ్యక్తుల పరిచయం అవుతారు. అధిక బాధ్యతల వలన ఆఫీసు పనుల్లో అధిక శ్రమ. పనులను ఓపికతో పూర్తి చేయవలసి ఉంటుంది. పై అధికారుల ప్రశంసలు. వ్యాపారస్తులకు అనుకున్న లాభాలు రావు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

వృషభ రాశి : ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. వారు మీ కొరకు ఎదురు చూస్తున్నారు. స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆఫీసు పనులలో అధిక బాధ్యతల వలన చికాకు. సరైన ప్రణాళికతో సకాలంలో పనులు పూర్తి చేస్తారు. దుబారా ఖర్చుల వలన కలిగిన నష్టాన్ని గుర్తిస్తారు. స్టాక్ మార్కెట్ ల ద్వారా లాభాలు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

మిధున రాశి : ఇతరుల నుంచి బహుమానాలు అందుకుంటారు. ఒత్తిడిని అధిగమించండి. మెడిటేషన్ ఒక మంచి ఉపాయం. దైవ ప్రార్థనల వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.. అనుభవజ్ఞుల సలహాలు పనిచేస్తాయి. బయట భోజనం కన్నా ఇంటి భోజనం మిన్న. ఈ రోజు అదృష్టం మీ వైపు ఉంది కావలసిన ధనం సంపాదిస్తారు పొదుపు చేస్తారు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు కుటుంబ వ్యవహారాలు మీ భార్యాభర్తల మధ్య గొడవలకు దారి తీయవచ్చు.

కర్కాటక రాశి : ఆశావహ దృక్పథం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. నెగెటివ్ ఆలోచనల వలన గందరగోళం. అనారోగ్యం నుంచి బయట పడతారు. ఆరోగ్యం చక్కబడుతుంది. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. మీ పిల్లలతో ఆనందంగా గడపటం వలన మీకు ఎంతో ఎనర్జీ. ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. కావలసినంత ధనం చేతికందుతుంది అవసరాలకు ఖర్చు పెడతారు. అధిక శ్రమ వలన వెన్ను నొప్పి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

సింహరాశి : వ్యాపారస్తులు తమ ప్రయాణాలలో వస్తువులు, డబ్బు జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యమైన నిర్ణయాలలో ఆత్మీయుల మరియు అనుభవజ్ఞులైన వారి సలహాలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో కుటుంబ విషయాల గురించి చర్చించండి వారు చెప్పేది వినండి. ఆఫీసు పనులలో అధిక శ్రమ. పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ఆదాయం పరవాలేదు అనవసరపు ఖర్చులను నివారించండి. అధిక శ్రమ వలన వెన్ను నొప్పి కాళ్ళనొప్పులు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలను మర్చిపోండి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజును గడపండి.

కన్యారాశి : మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. దీనివలన మీరు అనుకున్న కార్యాలను సులభంగా చేయగలరు. కావలసినంత ధనం చేతికందుతుంది. మరింత సంపాదన కొరకు నూతన మార్గాలను అన్వేషిస్తారు. మీ ఇంటికి కొత్తగా పాప/ బాబు రాబోతున్నారు ఆనందించండి ఆఫీసులో పనులను సకాలంలో చాకచక్యంగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో సంయమనంగా మాట్లాడండి. వారు చెప్పేది వినండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

తులారాశి : స్నేహితుల బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇది మీకు మనో ధైర్యాన్ని ఇస్తుంది. ఇతరుల వ్యక్తిగత వ్యవహారాల లోకి వెళ్ళకండి. అనుకోని ధనలాభం. దాని వలన మానసిక ప్రశాంతత. మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో గర్వకారణం. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఇతరులతో అనవసరపు బాతాఖానీ వలన సమయం వృధా. విద్యార్థులు టీవీ మొబైల్ వాడకం వలన చదువు మీద శ్రద్ధ పెట్టలేరు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

వృశ్చిక రాశి : ఆశావాహ దృక్పథం పట్టుదలతో అనుకున్న కార్యాలను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. ప్రయాణాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. వ్యాపారస్తులు అనుకున్న లాభాలను రావాలంటే అధిక శ్రమ పడవలసి ఉంది. ఆఫీసు పనుల్లో నిర్లక్ష్యం వద్దు సహనం తో పని చేయండి. పై అధికారులతో మాటలు రాకుండా జాగ్రత్తపడండి. ఆలయం బాగున్న అనుకోని ఖర్చులు ఎక్కువ. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

ధనస్సు రాశి : దైవ ధ్యానం వలన మానసిక బలం. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు కొంతమంది నగలు కొంటారు. అనుకోని ఖర్చులు ఉన్నాయి. డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. కుటుంబ సభ్యులతో పరుషంగా మాట్లాడకండి. ఆఫీసు పనులలో అధిక బాధ్యతలు. పనులు సకాలంలో పూర్తి కావాలంటే పట్టుదల సహనం కావాలి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మకర రాశి : ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలు సాధిస్తారు మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో గర్వకారణం. కుటుంబ సభ్యులతో కుటుంబ విషయాల గురించి చర్చిస్తారు. వారితో పరుషంగా మాట్లాడకండి. అనవసరపు ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు కొంతమంది ఉద్యోగ మార్పుకై చేస్తున్న ప్రయత్నాలు సఫలం బాతాఖానీ వలన సమయం వృధా. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలను మర్చిపోండి మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు గడపండి.

కుంభరాశి : దీర్ఘకాలంగా నడుస్తున్న కోర్టు కేసులో తీర్పు మీకు అనుకూలం. స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు. భయాందోళనలను వదిలివేయండి. ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోకండి. మీ మొండితనం వల్ల ఇంట్లో పెద్ద వారు బాధ పడతారు. అనుకున్న కార్యాలను సాధించాలంటే అధిక శ్రమ అవసరం. ఆదాయం పరవాలేదు అనవసరపు దుబారా ఖర్చును నివారించండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

మీన రాశి : ఇతరుల నుంచి బహుమానాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కుటుంబ వ్యవహారాల గురించి మాట్లాడతారు. వారితో గడపటం మీకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది. ఇంతకాలం ఇబ్బంది పెట్టిన వ్యవహారాలు చక్కబడతాయి. పెళ్లి కాని వారికి సంబంధం కుదిరే అవకాశం. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు. తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..