‘ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ ప్యాకేజ్’ పై వెబినార్

by  |

దిశ, న్యూస్‌బ్యూరో: కేంద్ర స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖకు చెందిన రీజన‌ల్ అవుట్ రీచ్ బ్యూరో (ఆర్ఓబీ) సోమవారం ‘ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ ప్యాకేజ్ – సూక్ష్మ‌, చిన్న, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లపై ప్ర‌భావం’ అనే అంశంపై వెబినార్ నిర్వ‌హించింది. వెబినార్‌లో హైదరాబాద్‌లోని కేంద్ర సూక్ష్మ, చిన్న, మ‌ధ్యత‌ర‌హా ప‌రిశ్ర‌మల (నిమ్స్ మే) జాతీయ సంస్థ ప్రోగ్రామ్ డైరెక్ట‌ర్ జి.సుద‌ర్శ‌న్ ప్ర‌ధాన వ‌క్త‌గా పాల్గొన్నారు. త‌క్కువ పెట్టుబ‌డితో స్వ‌యం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవ‌డానికి ప్ర‌భుత్వం అందిస్తున్న ప్రోత్సాహ‌కాల గురించి ఆయన వివ‌రించారు. ఇటీవ‌ల ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ ప్యాకేజీలో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం సూక్ష్మ‌, చిన్న, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల కోసం ప్ర‌క‌టించిన క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ గురించి వివ‌రించారు. ఎంఎస్ఎంఇ రంగంలో ప‌రిశ్ర‌మ‌లు నెల‌కొల్పేవారికి ప్ర‌భుత్వం ద్వారా రూ.3ల‌క్ష‌ల కోట్ల విలువైన క్రెడిట్ గ్యారంటీ స‌దుపాయాన్ని ప్ర‌భుత్వం క‌ల్పించింద‌ని సుద‌ర్శ‌న్ తెలిపారు. ప్ర‌ధానమంత్రి ముద్ర యోజ‌న‌, ప్ర‌ధానమంత్రి ఎంప్లాయ్ మెంట్ గ్యారంటీ తదితర ప‌థ‌కాల గురించి వివ‌రించారు. ఈ వెబినార్ లో పీఐబీ సౌత్ డైరెక్టర్ జనరల్ ఎస్‌.వెంక‌టేశ్వ‌ర్, రీజ‌న‌ల్ అవుట్ రీచ్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్ట‌ర్లు డాక్ట‌ర్ మాన‌స్ కృష్ణకాంత్‌, ఐ.హ‌రిబాబు, పి.భార‌తల‌క్ష్మి, క్షేత్ర ప్రచార అధికారులు, పీఐబీ అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed