కొవిడ్‌-19పై అవగాహన కోసం వెబి‌నార్

by  |

దిశ, న్యూస్​బ్యూరో: కొవిడ్-19 నుంచి ర‌క్షణ పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల‌పై రెసిడెన్షియ‌ల్‌ వెల్ఫేర్ అసోసియేష‌న్లకు ఈనెల 25న వెబి‌నార్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఎన్‌ఐఆర్‌డి, సిఆర్‌యు, జిహెచ్‌ఎంసి, డ‌బ్ల్యూహెచ్ఓ, యూనిసెఫ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వెబినార్​లో పాల్గొనాలనుకునే అసోసియేషన్లు ముందుగా రిజిస్త్రేషన్​ చేసుకోవాల్సి ఉంటుంది. 25న సాయంత్రం 4 గంట‌ల‌కు జ‌ర‌గ‌నున్న ఈ వెబినార్ కాన్ఫరెన్స్‌లో ముంబయి, కోల్‌క‌తా, న్యూఢిల్లీతో పాటు హైద‌రాబాద్‌లోని రెసిడెన్షియ‌ల్ వెల్ఫేర్ అసోసియేష‌న్లు పాల్గొన‌వ‌చ్చు. హైద‌రాబాద్ న‌గ‌రంలో దాదాపు 2,300 రెసిడెన్షియ‌ల్ వెల్ఫేర్ అసోసియేష‌న్లు ఉన్నాయి. ఈ వెబి‌నార్ కాన్ఫ్‌రెన్స్‌లో యూనిసెఫ్ ఛీఫ్ ఫీల్డ్ ఆఫీస‌ర్ మీట‌ల్ రుస్‌డియాతో పాటు జిహెచ్‌ఎంసి నుంచి ఆరోగ్య విభాగం అద‌న‌పు క‌మిష‌న‌ర్ బి.సంతోష్‌, యూసిడి అద‌న‌పు క‌మిష‌న‌ర్ జె.శంక‌ర‌య్య పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి మోడ‌రేట‌ర్లుగా క‌మ్యునికేష‌న్ రిసెర్చ్ యూనిక్​కు చెందిన శ్రీ‌నివాస్‌, అర‌వింద వ్యవ‌హ‌రిస్తారు. ఈ వెబి‌నార్ కాన్ఫరెన్స్​లో యూనిసెఫ్ నుంచి సంజీవ్ ఉపాధ్యాయ‌, డా.సి.కృష్ణ, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి డా.ఎ.కె.పుట్టరాజు, ప‌బ్లిక్ హెల్త్ ఇండియా ఫౌండేష‌న్ నుంచి డా.ర‌జన్ శుక్ల మాట్లాడ‌నున్నారు. రెసిడెన్షియ‌ల్ వెల్ఫేర్ అసోసియేష‌న్లు https://zoom.us/meeting/register/tJAscqoqTspH9O45f0xcmf1WX2YOLnsKG4n లింక్‌లో త‌మ వివ‌రాల‌ను రిజిస్టర్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.



Next Story

Most Viewed