భూమి ఇచ్చిన వారికి అండగా ఉంటాం: సబితా ఇంద్రారెడ్డి

by  |
భూమి ఇచ్చిన వారికి అండగా ఉంటాం: సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఫార్మా సిటీకి భూమి ఇచ్చిన వారందరికి అండగా ఉంటామని, ప్లాట్ తో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రపంచస్థాయి స్థిరమైన పారిశ్రామిక క్లస్టర్‌గా నిర్మించడానికి హైదరాబాద్ ఫార్మా సిటీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చిన రైతులకు ప్రతిపాదిత నివాస లేఅవుట్లను బుధవారం మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూసేకరణ చట్టం ప్రకారం ఫార్మా ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరిస్తున్న భూమికి పరిహారంతో పాటు ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎకరం ఇచ్చిన వారికి గుంటా భూమిని ఆ స్థలం లోనే ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. హౌజింగ్ కాలనీని రూ.300ల కోట్లతో అన్ని మౌలిక వసతులతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ఇబ్రహీపట్నం కిషన్ రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ అనిత, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story