రాజస్థాన్‌లోని ఫలోడిలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత

by Hajipasha |
రాజస్థాన్‌లోని ఫలోడిలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత
X

దిశ, నేషనల్ బ్యూరో : రాజస్థాన్‌లో ఎండలు మండిపోతున్నాయి. ఫలోడి నగరంలో శుక్రవారం 49 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఇప్పటివరకు దేశంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలోని దాదాపు 23 ప్రదేశాలలో శుక్రవారం సగటున 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజస్థాన్‌లోని బార్మర్ నగరంలో గురువారం 48.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. ఈ రాష్ట్రంలో వడగాలుల ధాటికి రెండు రోజులలోనే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎండల ప్రభావంతో గత వారం రోజుల్లో దేశంలోని 150 ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఐదేళ్ల కనిష్ఠ స్థాయికి తగ్గిపోయాయి. దీనివల్ల అనేక రాష్ట్రాల్లో నీటి కొరత తీవ్రమైంది. ఫలితంగా జలవిద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గింది.

Next Story