Macharla: పిన్నెల్లి ధ్వంసం చేసిన ఈవీఎంలో ఆ పార్టీకే ఎక్కువ ఓట్లు

by srinivas |
Macharla: పిన్నెల్లి ధ్వంసం చేసిన ఈవీఎంలో ఆ పార్టీకే ఎక్కువ ఓట్లు
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గం పాల్పాయి గేటు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పోలింగ్ కేంద్రంలో వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బీభత్సం సృష్టించారు. ఈవీఎం మెషిన్‌ను ధ్వంసం చేశారు. దీంతో ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే పగిలిపోయిన ఈవీఎంలో ఏ పార్టీకి ఓట్లు పడ్డాయనే ప్రశ్నలు వినిపించాయి.


ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పిన్నెల్లి పగులగొట్టిన ఈవీఎంలో తెలుగు దేశం పార్టీకి 22 ఓట్లు, వైసీపీకి 6 పోలైనట్లు తెలిపారు. పిన్నెల్లి ఈవీఎం పగులగొట్టే సమయంలో ఓటర్ స్లిప్పులు కింద పడ్డాయని, తద్వారా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయనే విషయం తెలిసిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తాయనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని ఆరోపించారు. మాచర్లలో మార్పు మొదలైందని, అది గమనించే పోలింగ్ రోజు పిన్నెల్లి అరాచకాలకు పాల్పడ్డారని వర్ల రామయ్య ఆరోపించారు.

Next Story