ఆయన కుమారుడిని ఎమ్మెల్యే చేయాలి..

61

దిశ, వెబ్ డెస్క్: ముత్యం రెడ్డి బతికున్నన్నిరోజులు దుబ్బాక అభివృద్ది కోసం కృషి చేశారని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఆయన ఆశయాలను నెరవేర్చడానికి ఆయన కొడుకును పంపారని రేవంత్ రెడ్డి తెలిపారు. దుబ్బాకలో కాంగ్రెస్ ఓడి పోతే నష్టం లేదు కానీ.. ప్రజల కష్టాలు మాత్రం తీరవని ఆయన చెప్పారు. ముత్యం రెడ్డి ఆశయాలను నెరవేర్చాలంటే ఆయన కుమారుడు శ్రీనివాస్ రెడ్డిని ఎమ్మెల్యే చేయాలని రేవంత్ రెడ్డి చెప్పారు.