మహిళా పారిశ్రామికవేత్తల కోసం 'వుయ్ హబ్' కీలక ఒప్పందం!

by  |
WE Hub
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం తెలంగాణ ప్రభుత్వం నేతృత్వంలో ‘వుయ్ హబ్’ గురువారం యూకేకు చెందిన బోల్టన్ యూనివర్శిటీతో కీలక ఒప్పందం చేసుకుంది. యూకేలో స్టార్టప్‌లకు సంబంధించి మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహించేందుకు ఈ ఒప్పందం జరిగింది. రెండేళ్ల భాగస్వామ్యంలో భాగంగా ‘వుయ్ హబ్’ మహిళా పారిశ్రామికవేత్తలను యూకే మార్కెట్లో విస్తరించేందుకు వీలు కల్పిస్తుంది. భవిష్యత్ సహకారాల కోసం ‘వుయ్ హబ్’, యూనివర్శిటీలకు ఈ ఒప్పందం కీలకం కానుంది. ‘వుయ్ హబ్’ సీఈఓ దీప్తి రావులా, బోల్టన్ యూనివర్శిటీ డిప్యూటీ వైస్-ఛాన్సలర్ కొండల్ రెడ్డి మధ్య ఈ అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) జరిగింది.

‘ఈ భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా మహిళా వ్యాపారవేత్తల కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలనుకుంటున్నాం. అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరించేందుకు, యూకేలోని బోల్టన్ యూనివర్శిటీ నుంచి స్థానిక వనరులను వినియోగించుకునేందుకు సహకారం ఉంటుందని’ దీప్తి రావులా చెప్పారు. ఈ ఒప్పందం ప్రకారం, ఎంపిక చేసిన స్టార్టప్‌లు వ్యాపారాభివృద్ధి అవకాశాలకు, మార్కెట్లపై అవగాహనకు, యూకేలోని క్లయింట్‌లతో సంప్రదింపులకు వీలవుతుంది. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ ఇన్నోవేషన్‌లను ప్రపంచ మార్కెట్లోకి వేగవంతంగా చేర్చే ప్రయోజనాలను పొందుతారు.



Next Story

Most Viewed